Black Thread | నల్ల దారంతో నర దిష్టి నుంచి తప్పించుకోవచ్చా..?
Black Thread | మీరు నర దిష్టి( Evil Eye ) ఉందా..? అనారోగ్యానికి గురవుతున్నారా..? అయితే మీరు నల్ల దారం( Black Thread ) ధరిస్తే అన్నీ మాయమైపోతాయట. నల్ల దారంతో నర దిష్టి( Nara Disti ) నుంచి తప్పించుకోవచ్చట. మరి అదేలాగో ఈ కథనంలో తెలుసుకుందాం.

Black Thread | ఆలయాలకు( Temples ) వెళ్లినప్పుడు భక్తులు( Devotees ) దేవుళ్లను మొక్కిన తర్వాత.. అక్కడ ఉండే ఎరుపు, నలుపు, ఆరెంజ్ కలర్‌లో ఉండే దారాలను కొనుగోలు చేస్తుంటారు. ఆ తర్వాత వాటిని చేతులకు కట్టుకుంటారు. ఇందులో ప్రధానంగా చాలా మంది నలుపు రంగు( Black Thread ) దారాన్నే ఎంచుకుంటారు. ఆ దారాన్నే చేతికి కట్టుకుంటారు. కొందరు మెడలో కూడా ధరిస్తారు. అయితే ఈ దారాన్ని ఒక భక్తిభావంతో కట్టుకుంటారు. కానీ దాని వెనుకాల కారణాలు మాత్రం తెలుసుకోరు. అయితే నల్ల దారానికి హిందూ సంప్రదాయం( Hindu Custom )లో తగిన స్థానం ఉందని పండితులు చెబుతున్నారు. మరి నల్ల దారం వల్ల కలిగే లాభాలు ఏంటి..? ఎందుకు కట్టుకోవాలి..? ఏ సమయంలో కట్టుకోవాలి..? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
మనకున్న దిష్టి దోషాన్ని తొలగించుకునేందుకు చాలా మంది నలుపు రంగుకు ప్రాధాన్యత ఇస్తారు. పుట్టినప్పటి నుంచి చివరి శ్వాస వరకు నలుపు రంగును తమలో భాగం చేసుకుంటారు. చిన్న పిల్లలకు నలుపు రంగుతో కూడిన చుక్కను పెడుతారు. పెళ్లి సమయంలో కూడా వధూవరులకు నలుపు రంగు చుక్క పెడుతారు. ఇదంతా ఎందుకంటే నర దిష్టి( Nara Disti ) నుంచి తప్పించుకోవడానికి చెబుతుంటారు. ఆ నల్ల చుక్క మాదిరే నల్ల దారం కట్టుకుంటే కూడా నర దిష్టి( Evil Eye ) నుంచి తప్పించుకోవచ్చని పండితులు చెబుతున్నారు.
మరి నల్ల దారం ఎప్పుడు కట్టుకోవాలి…?
నల్లదారాన్ని కేవలం శనివారం లేదా అమావాస్య రోజుల్లోనే కట్టుకోవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. శనివారం శని దేవుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజున నల్ల దారం ధరిస్తే.. శని దోషాలు తగ్గిపోయి, దుష్ట శక్తుల నుంచి రక్షణ లభిస్తుందట. అమావాస్య రోజున తామసిక శక్తులు ఎక్కువ సంచరిస్తాయట. కాబట్టి ఆ రోజున నల్ల దారం ధరిస్తే దృష్టి దోషంతో పాటు నెగిటివ్ ఎనర్జీ కూడా దరి చేరదట.
స్నానం చేశాకే నల్ల దారం కట్టుకోవాలా..?
నల్లదారం మెడలో ధరించినా, చేయి, కాలికి కట్టుకున్నా కట్టే ముందు కొన్ని పద్ధతులు పాటించాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. తప్పకుండా స్నానం చేసిన తరువాతనే దారం కట్టుకోవాలట. దారం కట్టుకునే ముందు ఇంట్లో దీపం లేదా అగరబత్తీ వెలిగించడం మంచిదని చెబుతున్నారు. మహిళలు, పిల్లలు ఎడమ చేతికి, పురుషులు కుడి చేతికి కట్టుకోవాలట. ఇక దారాన్ని బేసి సంఖ్యలో చుట్టుకోవాలని సూచిస్తారు. వీలైతే మూడు, లేదంటే ఏడు, తొమ్మిది రౌండ్లు చుట్టుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు.