జులై 25 రాశిఫలాలు.. ఈ రాశివారికి కల్యాణఘడియలు వచ్చేస్తున్నాయి..!
Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం
ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన ప్రయోజనాలు పొందుతారు. సమాజంలో మీకు గౌరవం, ఖ్యాతి పెరుగుతాయి. జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టేందుకు ఎదురుచూస్తున్నవారికి శుభసమయం నడుస్తోంది. అవివాహితులకు కల్యాణఘడియలు సమీపించాయి.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. పెట్టుబడులు, లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. విశేషమైన శుభఫలితాలు ఉంటాయి. ప్రశంసలు లభిస్తాయి. ఆర్థికపరమైన ప్రయోజనాలు కూడా మెరుగ్గా ఉంటాయి.
మిథునం
ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారంలో పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. తొందరపాటు నిర్ణయాలతో సంబంధాలు చెడగొట్టుకోవడం మంచిది కాదు. రాజీధోరణి అవలంబిస్తే మేలు. విలాసవంతమైన వస్తువుల కోసం అధిక ధనవ్యయం ఉంటుంది.
కర్కాటకం
మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తమ తమ రంగాలలో విజయం సాధించాలంటే తీవ్రంగా శ్రమించాలి. ఏది సులభంగా దొరకదన్న వాస్తవాన్ని గుర్తిస్తే మేలు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. మానసికంగా, సంతోషంగా ఉంటారు. స్నేహితులు, బంధువులతో విహారయాత్రలకు వెళ్లి సరదాగా గడుపుతారు. సంపద వృద్ధి చెందుతుంది.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు విశేషంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో ఎటు చూసినా శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. వారసత్వపు ఆస్తులు కలిసి వస్తాయి. సంపద వృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు.
తుల
తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారికి శ్రమకు తగిన ఫలం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తులు కలిసి వస్తాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారు గొప్ప లాభాలను అందుకుంటారు.
వృశ్చికం
ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ వ్యవహారాల్లో మొండి పట్టుదలకు పొతే తరువాత చింతించాల్సి ఉంటుంది. పట్టు విడుపు ధోరణితో ఉంటే మంచిది. మొహమాటాలు పోతే మొదటికే మోసం వస్తుంది. ఆర్ధిక వ్యవహారాల్లో నిక్కచ్చిగా ఉండాలి.
ధనుస్సు
అన్ని రంగాల వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలం ఉంటుంది. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలు క్లిష్టంగా ఉంటాయి. సమస్యల పరిష్కారానికి మీరు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో అనుకోని ఆటంకాలు, సవాళ్లు ఎదురవుతాయి. బుద్ధిబలంతో సమస్యల నుంచి బయట పడతారు. వ్యాపారంలో ఆర్ధికంగా నష్ట పోవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకొని మౌనంగా ఉండటం శ్రేయస్కరం.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ రంగాల వారికి ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. వృత్తి పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ చాలా కాలంగా ఎదురుచూస్తున్న మైలురాయిని అందుకుంటారు. ఆదాయం పదింతలు పెరుగుతుంది.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో విజయాలను సొంతం చేసుకుంటారు. ధ్యానం, యోగా సాధన చేయడం ద్వారా ప్రశాంతత పొందవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలకు అవకాశం ఉంది.