Horoscope | మంగళవారం.. మీ రాశిఫలం ఎలా ఉందంటే..?
చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం
మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. మానసికంగా ఆందోళనతో ఉంటారు. ఖర్చులు అదుపు తప్పుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది.
వృషభం
వృషభరాశి వారికి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారు ఈ రోజు ప్రతి పనిలోనూ అప్రమత్తంగా ఉండడం అవసరం. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో అనవసరమైన వివాదాలు రావచ్చు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు పనికి రాదు. జాగ్రత్తగా వ్యవహరిస్తే సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు గ్రహసంచారం శుభకరంగా ఉంది. ఇంటా బయట విశేషమైన ప్రయోజనాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పదోన్నతి, బదిలీ అందుకుంటారు.
సింహం
సింహం ఈ రోజు మీకు నిరాశాజనకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో తీవ్రమైన కృషితోనే విజయం లభిస్తుంది. ఉగ్యోగులకు పనులు మెల్లగా సాగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేస్తే మంచిది.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. మానసికంగా, శారీరకంగా ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. సంపద పెరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి.
తుల
తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మీ మనోభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక లాభం, శత్రు జయం ఇలా ఎటు చూసినా అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు అదృష్టకరంగా ఉంటుంది. దైవ దర్శనాలు, ఆర్థిక ప్రయోజనాలు వంటి శుభఫలితాలతో రోజంతా ఆనందంగా ఉంటారు. మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన మనస్సు కలిసి వృత్తి వ్యాపారాలలో అద్భుతాలు చేస్తాయి.
ధనుస్సు
ధనుస్సు రాశి వారికి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపార రంగాల వారు అన్ని విషయాలలో ఆచితూచి అడుగు వేస్తే మంచిది. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం సహకరించదు.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. దైవబలంతో అన్ని పనులు పూర్తి అవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశముంది జాగ్రత్తగా ఉండండి.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు ఆరోగ్యం, సంపద, సంతోషం అన్నీ అనుగ్రహించబడతాయి. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలకు మంచి రోజు. ఆర్థిక లాభాలు వెన్నంటే ఉంటాయి.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు నష్టాలను తీసుకు వస్తాయి. మానసిక ప్రశాంతత ఉండదు. చేసే పనిలో స్పష్టత లేనందున పనులు ఆలస్యం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది.