Bigg Boss 9 | నాలుగు రోజుల్లో ముగియనున్న సీజన్ 9 .. ఫ్యామిలీ వీడియోతో ఎమోషనల్ అయిన కంటెస్టెంట్లు
Bigg Boss 9 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో డే 99, డే 100 ఎపిసోడ్‌లు టాస్క్‌లతో పాటు ఎమోషనల్ మూమెంట్స్‌తో నిండిపోయాయి. డే 99 రాత్రి 9 గంటలకు బిగ్‌బాస్ “ఈ టాస్క్ గుర్తుందా? ఈసారైనా అర్థం చేసుకుని సరిగ్గా ఆడతారా, లేక తెలివితేటలు చూపిస్తారా?” అంటూ ‘సేవ్ ఇట్ టు విన్ ఇట్’ టాస్క్‌ను ప్రకటించారు.
Bigg Boss 9 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో డే 99, డే 100 ఎపిసోడ్‌లు టాస్క్‌లతో పాటు ఎమోషనల్ మూమెంట్స్‌తో నిండిపోయాయి. డే 99 రాత్రి 9 గంటలకు బిగ్‌బాస్ “ఈ టాస్క్ గుర్తుందా? ఈసారైనా అర్థం చేసుకుని సరిగ్గా ఆడతారా, లేక తెలివితేటలు చూపిస్తారా?” అంటూ ‘సేవ్ ఇట్ టు విన్ ఇట్’ టాస్క్‌ను ప్రకటించారు. ఐదు నిమిషాల పాటు బాక్స్‌లో ఉన్న నీడిల్ మాస్క్‌కు తగలకుండా గాల్లో ఉంచే పెయిర్ విజేతగా నిలుస్తారు అని ప్రకటించారు. ఈ టాస్క్‌లో కేవలం మూడు బెలూన్లు మాత్రమే వాడాల్సి ఉంది. సంచాలక్ ఎంపిక సమయంలో డెమోన్ తాను ఆడాలనే కోరికను వ్యక్తం చేసినా, రెండు స్టార్లు వచ్చాయని చెప్పి అందరూ కలిసి అతన్ని సంచాలక్‌గా నియమించారు.
ఈ టాస్క్‌లో తనూజా టీమ్ విజయం సాధించగా, కళ్యాణ్, తనూజాలకు స్టార్లు అందించారు. అదనంగా చికెన్ వింగ్స్‌ను ట్రీట్‌గా పంపించారు. ‘ప్లేయర్ ఆఫ్ ది డే’గా డెమోన్‌ను బిగ్‌బాస్ ప్రకటించగా, అతనికి అన్నయ్య నుంచి వచ్చిన వీడియో మెసేజ్ ఎమోషనల్‌గా మార్చింది. బిగ్‌బాస్ హౌస్‌ను వదిలి వెళ్లాలనిపించడం లేదని, ఇతరులు బాధపడతారేమోనన్న భయంతో ఇన్నాళ్లూ గట్టిగా మాట్లాడలేకపోయానని ఒక్కడినే కూర్చుని బిగ్‌బాస్‌తో మాట్లాడుకుంటూ డెమోన్ భావోద్వేగానికి లోనయ్యాడు. డే 100లో ‘పిక్ ది బోన్’ టాస్క్‌ను ఇచ్చారు. తాళ్లతో కట్టిన ఇచ్చును, టైర్లను దాటుకుంటూ బోన్‌ను ఎక్కువసార్లు పట్టుకున్నవారే విజేతలుగా నిలవాలి. చివరి రౌండ్‌లో కళ్యాణ్, డెమోన్ మధ్య పోటీ జరగగా, డెమోన్ విజయం సాధించి మరో స్టార్ దక్కించుకున్నాడు.
డెమోన్ మీకిది ఎన్నో ట్రీట్? అన్నీ మీకేనా?” అని బిగ్ బాస్ అడగడంతో .. మూడుసార్లు అని చెప్పి అందరితో పంచుకోవడానికి మటన్ మండినీ ట్రీట్ గా అడిగాడు డెమోన్. ఫ్రాంకీని పంపి, ఆ టేస్ట్ ను సంజనాతో సంజనాతో పంచుకోవాలని బిగ్‌బాస్ సూచించారు. అనంతరం ‘విన్ ఇట్ టు గెయిన్ ఇట్’ టాస్క్‌లో తనూజా, ఇమ్మూ, సంజన పోటీ పడగా, తనూజా విజేతగా నిలిచి మరో స్టార్ దక్కించుకుంది. ఆమెకు ట్రీట్‌గా డ్రై ఫ్రూట్స్ రబ్డి అందించారు. ఇక ‘ధమాకా కింగ్’ టాస్క్‌లో వెల్క్రోపై చెప్పును ఎక్కువ ఎత్తులో అతికించే పోటీలో మూడు రౌండ్లలో డెమోన్ గెలిచి మొత్తం నాలుగు స్టార్లు సొంతం చేసుకున్నాడు. దీనికి బిగ్‌బాస్ తందూరి చికెన్‌ను ట్రీట్‌గా పంపారు. అదే రోజు ‘ప్లేయర్ ఆఫ్ ది డే’గా తనూజాను ప్రకటించగా, ఆమెకు కుటుంబంతో కలిసి ఉన్న చెల్లి పెళ్లి ఫోటోను పంపించారు. ఆ ఫోటోను చూసిన వెంటనే తనూజా ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram