Tanuja | తనూజ విన్నర్ కానందుకు వెక్కి వెక్కి ఏడ్చిన లేడి ఫ్యాన్.. వైరల్ అవుతున్న వీడియో
Tanuja | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్‌గా ముగిసింది. ఆర్మీ మ్యాన్‌గా గుర్తింపు పొందిన కామనర్ కళ్యాణ్ పడాల ఈ సీజన్ విజేతగా నిలవగా, లేడీ కంటెస్టెంట్ తనూజ రన్నరప్‌గా నిలిచింది.
Tanuja | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్‌గా ముగిసింది. ఆర్మీ మ్యాన్‌గా గుర్తింపు పొందిన కామనర్ కళ్యాణ్ పడాల ఈ సీజన్ విజేతగా నిలవగా, లేడీ కంటెస్టెంట్ తనూజ రన్నరప్‌గా నిలిచింది. అయితే ఫైనల్ ఫలితాలు ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. సీజన్ ఆరంభం నుంచే తనూజ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. తన ఆటతీరు, మాట తీరు, భావోద్వేగాలు వ్యక్తపరిచే విధానంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఆమెకు లభించిన భారీ సపోర్ట్ చూసి ఈసారి బిగ్ బాస్‌లో లేడీ కంటెస్టెంట్ విజేత అవుతుందని చాలా మంది అంచనా వేశారు. కానీ ఫైనల్‌లో పరిస్థితి మారిపోయింది. చివరి క్షణాల్లో కళ్యాణ్ పడాల టాప్‌లోకి దూసుకొచ్చి విజేతగా నిలిచాడు.
తనూజ రన్నరప్‌గా నిలవడం పట్ల చాలా మంది అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ లేడీ ఫ్యాన్ వెక్కి వెక్కి ఏడుస్తూ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ, “తనూజ విన్ అవనందుకు చాలా బాధగా ఉంది. బిగ్ బాస్‌లో ఆడవాళ్లకు ఒక్కసారి కూడా సరైన గుర్తింపు దక్కదా? వంటింట్లోనే ఉండిపోవాలా? సీజన్ మొత్తం ఆడియన్స్ ఆమెకు సపోర్ట్ చేశారు కదా… చివర్లో ఏమయ్యింది?” అని కన్నీళ్లు పెట్టుకుంది. “కళ్యాణ్ విన్నర్ అయినందుకు బాధ లేదు. కానీ ఈసారి అయినా ఒక లేడీ విన్నర్‌ను చూడాలని అనుకున్నాను. తనూజ విన్ అవనందుకు చాలా బాధగా ఉంది” అంటూ ఆమె భావోద్వేగంగా మాట్లాడింది.
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. మేము కూడా తనూజే విన్నర్ అవుతుందని అనుకున్నాం,కళ్యాణ్ గెలవడం షాక్ ఇచ్చింది,ఈసారి లేడీ విన్నర్ మిస్ అయింది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరోవైపు, కళ్యాణ్ పడాల గెలుపును సమర్థిస్తూ కూడా పలువురు అభిమానులు స్పందిస్తున్నారు. గత కొన్ని వారాలుగా ఆయనకు లభించిన భారీ ఆడియన్స్ సపోర్ట్‌నే విజయంలో కీలకమని వారు చెబుతున్నారు. మొత్తానికి బిగ్ బాస్ 9 ఫలితాలు ప్రేక్షకుల్లో భావోద్వేగాలను రేకెత్తించాయి. విజేతగా కళ్యాణ్ పడాల నిలిచినా, తనూజ రన్నరప్ కావడం మాత్రం అభిమానులకు తీపి-చేదు అనుభూతిని మిగిల్చింది. ఈ సీజన్ మరోసారి బిగ్ బాస్ అంటే కేవలం ఒక షో కాదు… భావోద్వేగాల ప్రయాణమనే విషయాన్ని గుర్తు చేసింది.
View this post on Instagram
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram