Ariyana | బిగ్ బాస్‌లో నా వీపు కాలింది.. నాకొక మంచి బాయ్ ఫ్రెండ్ కావాలంటున్న అరియానా

Ariyana |యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అరియనా గ్లోరీ, సోషల్ మీడియా ద్వారా వచ్చిన గుర్తింపు, బిగ్‌బాస్ షోలతో విపరీతమైన ఫేమ్‌ను సంపాదించుకుంది. బిగ్‌బాస్ సీజన్ 4తో పాటు బిగ్‌బాస్ నాన్‌స్టాప్ సీజన్‌లో పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం టీవీ షోలు, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా అవకాశాలు దక్కించుకుంటూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది.

  • By: sn |    movies |    Published on : Dec 30, 2025 12:50 PM IST
Ariyana | బిగ్ బాస్‌లో నా వీపు కాలింది.. నాకొక మంచి బాయ్ ఫ్రెండ్ కావాలంటున్న అరియానా

Ariyana |యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అరియనా గ్లోరీ, సోషల్ మీడియా ద్వారా వచ్చిన గుర్తింపు, బిగ్‌బాస్ షోలతో విపరీతమైన ఫేమ్‌ను సంపాదించుకుంది. బిగ్‌బాస్ సీజన్ 4తో పాటు బిగ్‌బాస్ నాన్‌స్టాప్ సీజన్‌లో పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం టీవీ షోలు, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా అవకాశాలు దక్కించుకుంటూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది. తాజాగా అరియనా గ్లోరీ ఓ ప్రముఖ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో మర్చిపోలేని సంఘటనను గుర్తు చేసుకుంది. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో పాల్గొన్న సమయంలో తనకు జరిగిన ప్రమాదం గురించి ఆమె భావోద్వేగంగా మాట్లాడింది.

బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు తన వీపు కాలిపోయిందని, ఆ ఘటన నుంచి బయటపడటానికి దాదాపు సంవత్సరం సమయం పట్టిందని వెల్లడించింది. ఆ గాయం పూర్తిగా మాయ కాలేదని, ఇప్పటికీ ఓ మచ్చగా మిగిలిపోయిందని తెలిపింది. ఆ సమయంలో తన కెరీర్ అక్కడితో ముగిసిపోయిందేమో అని తీవ్రంగా బాధపడ్డానని చెప్పిన అరియనా, అప్పుడు బిందు మాధవి తనకు అండగా నిలిచి ధైర్యం చెప్పిందని గుర్తు చేసుకుంది. గాయం ముఖంపై పడలేదని, భయపడాల్సిన అవసరం లేదని బిందు మాధవి చెప్పిన మాటలు తనకు ఎంతో ధైర్యం ఇచ్చాయని తెలిపింది. తన జీవితంలో ఆ సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేనని, స్కిన్ కాలడం అనే విషయం ఇప్పటికీ తలుచుకుంటే భయంగా ఉంటుందని అరియనా గ్లోరీ చెప్పుకొచ్చింది.

ఇక త‌న‌కు గతంలో రెండు రిలేషన్ షిప్స్ బ్రేక్ అయ్యాయి. నేను ఇద్దరిని సెల‌క్ట్ చేసుకోగా, అవి త‌ప్పుడు నిర్ణ‌యాలు అని త‌ర్వాత తెలిసింది. మంచి రిలేష‌న్ షిప్ నాకు కావాలి. ఎవ‌రో ఒక‌రు వ‌చ్చి మ్యాజిక్ జ‌రగాలి. నేను ఎంపిక చేసుకుంటే అది స‌రిగ్గా ఉండ‌డం లేదు. నాకొక మంచి బాయ్ ఫ్రెండ్ కావాలి. న‌న్ను అర్ధం చేసుకొని నా సొంత వాడు అనిపించాలి. అలాంటి వాడు దొర‌క‌క‌నే నేను సింగిల్‌గా ఉన్నాను. నేను రిలేష‌న్ షిప్‌లో ఉన్న‌ప్పుడు తమ్ముడు అనుకున్న అబ్బాయి డ‌బ్బుల విష‌యంలో మోసం చేసిన‌ట్టు అరియానా పేర్కొంది. నాకు ఒక‌సారి ఆరు ల‌క్ష‌ల అవ‌స‌రం వచ్చిన‌ప్పుడు ఎవ‌రు నాకు స‌పోర్ట్‌గా లేర‌ని అరియానా తెలియ‌జేసింది. ప్ర‌స్తుతం అరియానా చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి.