Shiva Jyothi | తప్పుచేసి లెంపలేసుకున్న శివ జ్యోతి.. వివాదం ముగిసినట్టేనా?
Shiva Jyothi | తెలుగు ప్రేక్షకులకి తీన్మార్ సావిత్రిగా పరిచయమైన యాంకర్ శివజ్యోతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆమె తిరుమల ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీశాయి.
Shiva Jyothi | తెలుగు ప్రేక్షకులకి తీన్మార్ సావిత్రిగా పరిచయమైన యాంకర్ శివజ్యోతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆమె తిరుమల ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీశాయి. ప్రసాదాన్ని “అడుక్కున్నాం” అని అన్న నేపథ్యంలో చేసిన కామెంట్స్ పై హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ, ప్రసాదం గురించి ఇలా వెకలిగా మాట్లాడడం అంగీకారయోగ్యం కాదని సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, శివజ్యోతి తాజాగా వీడియో ద్వారా ప్రజలకు క్షమాపణలు తెలిపారు.
అలా మాట్లాడకుండా ఉండాల్సింది..
ఆ వీడియోలో మాట్లాడుతూ.. “తిరుమల ప్రసాదం గురించి నేను ఉపయోగించిన పదాలు చాలా మందికి తప్పుగా అనిపించాయి. నా మాటల వల్ల బాధపడ్డ ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక క్షమాపణలు.. ‘మేము రిచ్’ అని చెప్పింది.. పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు, రూ.10000 ఎల్1 క్యూ లైన్‌లో నిలబడ్డామనే ఉద్దేశంతో కాస్ట్‌లీ అన్నాను. నన్ను ఎప్పటినుంచో ఫాలో అయ్యేవారికి తెలుసు ..వెంకటేశ్వర స్వామిపై నాకు ఉన్న భక్తి ఎంత బలమైనదో. గత నాలుగు నెలలుగా శనివారం వ్రతాలు చేస్తున్నాను. నా బిడ్డ కూడా స్వామివారి ప్రసాదమేనని నేను భావిస్తాను. అలాంటి నేను స్వామివారి గురించి ఎప్పటికీ అగౌరవంగా మాట్లాడలేను. మాట తప్పుగా వచ్చివుండొచ్చు, కానీ ఇంటెన్షన్ మాత్రం తప్పు కాదు. పలువురి ఒత్తిడికో, కేసులకి భయపడి క్షమాపణలు చెప్పడం లేదు. ఆ మాట నాకే సరైనదిగా అనిపించలేదు. అందుకే సారీ చెప్తున్నా” అని తెలిపారు.
శివజ్యోతి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె క్షమాపణలతో వివాదం కొంత శాంతించినప్పటికీ, ఈ వ్యాఖ్యలు మరోసారి ప్రజా వేదికలో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరమనే చర్చకు దారితీశాయి.ఇక శివజ్యోతి ప్రస్తుతం ప్రగ్నెంట్ అన్న విషయం తెలిసిందే. చాలా ఏళ్ల తర్వాత గర్భం దాల్చడంతో ప్రతి మూమెంట్‌ని కూడా తన ఫాలోవర్స్‌తో పంచుకుంటూ ఫుల్ ఖుష్ అవుతుంది. శివ జ్యోతి బిగ్ బాస్ షోతో మరింత పాపులారిటీ దక్కించుకున్న విషయం తెలిసిందే.
View this post on Instagram
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram