Money Plant | మనీ ప్లాంట్‌ను ఈ దిశలో ఉంచుతున్నారా..? అయితే వైవాహిక జీవితంలో విభేదాలు తప్పవు..!!
Money Plant | మనీ ప్లాంట్.. ఆర్థిక ఇబ్బందులను( Finance Problems ) తొలగిస్తుందని చాలా మంది విశ్వసిస్తుంటారు. ఇక ప్రతి ఇంట్లోనూ మనీ ప్లాంట్( Money Plant ) దర్శనమిస్తుంది. అయితే ఈ మొక్కను ఈ రెండు దిశల్లో ఉంచితే.. ఆ ఇంట్లోని దంపతుల( Couples ) మధ్య విభేదాలు తప్పవని వాస్తు నిపుణులు( Vastu Experts ) హెచ్చరిస్తున్నారు.

Money Plant | మనీ ప్లాంట్ లేని ఇల్లు ఉండదు. చాలా మంది తమ నివాసాల్లో మనీ ప్లాంట్( Money Plant )ను పెంచుతుంటారు. ఎందుకంటే ఆ మొక్క ఆకర్షణీయంగా ఉండడమే కాకుండా, ఇంట్లో ఉన్న ఆర్థిక కష్టాలను( Finance Problems ) పారదోలుతుందని నమ్మకం. ఈ మొక్కకు డబ్బు( Money )ను ఆకర్షించే గుణం ఉంటుంది. కాబట్టి ఆర్థిక కష్టాలను తొలగిస్తుందని వాస్తు నిపుణులు( Vastu Experts ) చెబుతున్నారు. సంపదతో పాటు అదృష్టాన్ని కూడా మనీ ప్లాంట్ తీసుకువస్తుందని పేర్కొంటున్నారు. అయితే మనీ ప్లాంట్‌ను ఇంట్లో ఉంచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే తప్పనిసరిగా సంపద సమకూరడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.
మనీ ప్లాంట్‌ను ఈ దిశలో అసలు ఉంచకూడదు..
వాస్తు శాస్త్రం ప్రకారం.. మనీ ప్లాంట్‌ను పడమర, తూర్పు దిశల్లో ఉంచకూడదు. ఈ రెండు దిశల్లో మనీ ప్లాంట్ ఉంటే.. ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అధికమవుతాయట. అంతేకాకుండా వైవాహిక జీవితంలో కూడా విభేదాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు తూర్పు, పడమర దిశల్లో మనీ ప్లాంట్‌ను ఉంచకపోవడమే మంచిది.
మనీ ప్లాంట్‌ను ఏ దిశలో ఉంచితే మంచిది..?
వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ మీ ఇంటి ఆగ్నేయ మూలకు ఎదురుగా ఉండాలి. ఇది చెడు శక్తిని దూరం చేస్తుంది. శ్రేయస్సు, అదృష్టాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఆ ఇంట సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
మనీ ప్లాంట్‌ను వంట గదిలో ఉంచొచ్చా..?
చాలా మంది ఇంట్లోని వంటగదిలో మనీ ప్లాంట్ ఉంచుతారు. ఇలా పెట్టడం మంచిదికాదని చెబుతోంది వాస్తు. వంటగదిలో మనీప్లాంట్ పెడితే దురదృష్టాన్ని తెస్తుందట. ఆర్థిక కష్టాలను కొని తెచ్చుకున్నట్టే అవుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
మనీ ప్లాంట్‌ను ఇతరులకు ఇవ్వొచ్చా..?
మీ ఇంట్లో పెంచుకుంటున్న మనీ ప్లాంట్‌ను కట్ చేసి ఇతరులకు ఎప్పటికీ ఇవ్వకండి. ఆకులు ఎండిపోయినా లేదా వాడిపోయినా, వాటిని కత్తిరించండి. కానీ ఇతరులకు ఇవ్వకపోవడం మంచిది. ఒకవేళ వేరేవాళ్లకు ఇస్తే మీ సంపద, విజయాన్ని ఇతరులకు పంచిపెట్టినట్లవుతుందని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు.
మనీ ప్లాంట్‌ను ఎరుపు రంగు వస్తువులకు దూరంగా ఉంచాలి..
మనీ ప్లాంట్ దగ్గర ఎరుపు రంగు వస్తువులు ఉండకూడదు. ఆకుపచ్చ లేదా నీలి రంగులో ఉన్న వస్తువులు ఉండాలి. మనీ ప్లాంట్ తొట్టి కూడా ఎరుపు రంగులో ఉండకూడదు.