పొద్దున నిద్ర లేవగానే ఈ వస్తువులు చూస్తున్నారా..? అయితే దరిద్రం వెంటాడినట్టే..!
చాలా మంది పొద్దున నిద్ర లేవగానే తమకు ఇష్టమైన వారిని చూస్తారు. లేదంటే ఇంట్లో ఉండే దేవుళ్ల పోటోలను చూస్తారు. కొందరైతే తమ ముఖాన్ని అద్దంలో చూసుకుంటుంటారు. ఆ తర్వాతనే మిగతా కార్యక్రమాలు ప్రారంభిస్తారు.

చాలా మంది పొద్దున నిద్ర లేవగానే తమకు ఇష్టమైన వారిని చూస్తారు. లేదంటే ఇంట్లో ఉండే దేవుళ్ల పోటోలను చూస్తారు. కొందరైతే తమ ముఖాన్ని అద్దంలో చూసుకుంటుంటారు. ఆ తర్వాతనే మిగతా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. పొద్దున నిద్ర లేవగానే వీటిని చూడకూడదని పండితులు హెచ్చరిస్తున్నారు. ఒక వేళ చూడకూడని వస్తువులను చూస్తే దరిద్రం వెంటాడుతుందని చెబుతున్నారు. మరి ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం..
అద్దంలో చూసుకోవడంతో అరిష్టం..
పొద్దున మేల్కొనగానే చాలా మంది అద్దంలో తమ ముఖం చూసుకుంటారు. చింపిరిగా ఉన్న జుట్టును దువ్వుకుంటారు. అయితే నిద్ర లేచిన వెంటనే ఈ రెండు పనులు చేయడం మంచిది కాదని పండితులు హెచ్చరిస్తున్నారు. నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకోవడంతో అరిష్టం వస్తుందట. పొద్దున్నే జుట్టు దువ్వుకోవడం వల్ల దురదృష్టం కలుగుతుందట. ఈ రెండు పనులు ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని కూడా పెంచుతుందట. ఇది ఏ మాత్రం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయం లేచిన తర్వాత స్నానం చేసి పూజ గదిని సందర్శించిన తర్వాతే అద్దంలో ముఖం చూసుకోవాలని, జుట్టు దువ్వుకోవాలని సూచిస్తున్నారు.
గోడ గడియారాలను చూస్తే అశుభం..
ఇక నిద్ర లేచిన వెంటనే చాలా మంది గోడపై ఉన్న గోడ గడియారాలను చూస్తుంటారు. టైమ్ ఎంతయిందో అని తెలుసుకుని మేల్కొంటారు. ఇది ఒకరకంగా మంచిదే అయినప్పటికీ.. పాడైపోయిన, పగిలిపోయిన గడియారాలను చూడటం అశుభ సూచకమని పండితులు చెబుతున్నారు. కాబట్టి పాడైపోయిన గడియారాలను ఎట్టి పరిస్థితులలోనూ చూడకుండా ఉండాలి. ఒకవేళ అలా చూస్తే అది మనకు చెడు జరిగేలా చేస్తుందని చెబుతున్నారు.
ఎంగిలి గిన్నెలను చూస్తే దరిద్రం..
చాలా మంది ఉదయం లేవగానే కిచెన్లోకి వెళ్లి రాత్రిపూట తిని వదిలేసిన గిన్నెలను శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తారు. ఎట్టి పరిస్థితులలోనూ రాత్రిపూట తిని వదిలేసిన ఎంగిలి గిన్నెలను ఉదయం చూడకూడదని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల దరిద్రం వెంటాడుతుందని అంటున్నారు. కాబట్టి ఉదయం నిద్ర లేచిన తర్వాత మొదట మీరు మీ చేతులను చూసుకొని భూదేవికి ప్రణామం చేయాలని పండితులు సూచిస్తున్నారు.