Vastu Tips | మీ ఇంట్లో మల్లె చెట్టు ఉందా..? ఆ దిశలో పెంచితే విపరీతమైన ధనలాభం..!!
Vastu Tips | ఇంటి ఆవరణలో పువ్వులు( Flowers ), పండ్ల మొక్కలను పెంచుకునేందుకు ఇష్టపడుతుంటారు. అయితే ఆ పువ్వులు, పండ్ల మొక్కలను వాస్తు నియమాల( Vastu Tips ) ప్రకారం పెంచితే ఆ ఇంట అష్టైశ్వర్యాలు పండుతాయి. మరి ముఖ్యంగా మల్లె చెట్టు( Jasmine Tree )ను సరైన దిశలో పెంచితే ఆ ఇంట్లో విపరీతమైన ధనలాభం( Money Profit ) ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
Vastu Tips | హిందువులు( Hindus ) చాలా మంది వాస్తు( Vastu )ను నమ్ముతుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారమే తమ ఇంటిని నిర్మించుకుంటారు. చెప్పులు ఉంచే స్థలం నుంచి నిద్రించే పడకగది వరకు ఎక్కడా కూడా వాస్తు విషయంలో కాంప్రమైజ్ కానేకారు. అదే విధంగా ఇంటి ఆవరణలో చెట్ల పెంపకం విషయంలో కూడా వాస్తు నియమాలను పాటిస్తుంటారు. ప్రతి ఇంట్లో మల్లె( Jasmine ), కొబ్బరి( coconut ), మామిడి( Mango ), దానిమ్మ మొక్కలు కనిపిస్తుంటాయి. అయితే ఈ మొక్కలను వాస్తు ప్రకారం( Vastu Tips ) సరైన దిశలో పెంచాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
మల్లె చెట్టు
మల్లె చెట్టును ఇంటి ఆవరణలో పెంచడం వల్ల అష్టైశ్వర్యాలు కలిగి, విపరీతమైన ధనలాభం కలుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తూర్పు, దక్షిణం దిక్కులో మల్లె చెట్టును పెంచాలని సూచిస్తున్నారు.
కొబ్బరి, మామిడి
కొబ్బరి, మామిడి చెట్టును ఇంటి ఆవరణలో దక్షిణం దిక్కులో పెంచాలని సూచిస్తున్నారు. దక్షిణ దిశలో కొబ్బరి, మామిడి చెట్లను పెంచడం వల్ల ఆ ఇంటికి అదృష్టం కలిసి వస్తుందట.
దానిమ్మ
దానిమ్మ చెట్లను ఇంటి ఆవరణలో పెంచడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దానిమ్మ చెట్టును దాదాపు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఏ ఇంటి ఆవరణలో దానిమ్మ మొక్క ఉంటుందో అక్కడ లక్ష్మీ దేవి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుందట. దానిమ్మ మొక్క తన నివాసమని లక్ష్మీ దేవి చెప్పినట్లుగా పద్మ పురాణంలో కూడా ఉందన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram