Vastu Tips | మీ ఇంట్లో ఈ ఐదు చెట్లు ఉంటే.. వాస్తు దోషాలు తొల‌గిపోయిన‌ట్టే..!

Vastu Tips | వాస్తు దోషాల‌తో ఇబ్బంది ప‌డేవారు కొన్ని ప‌రిహారాలు చేయాల్సిందే. అవ‌స‌ర‌మైతే కొన్ని మొక్క‌ల‌ను, చెట్ల‌ను ఇంటి ఆవ‌ర‌ణ‌లో పెంచుకోవాలి. అలా చేస్తే వాస్తు దోషాలు తొల‌గిపోతాయ‌ని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Vastu Tips | మీ ఇంట్లో ఈ ఐదు చెట్లు ఉంటే.. వాస్తు దోషాలు తొల‌గిపోయిన‌ట్టే..!

Vastu Tips | చాలా మంది త‌మ ఇండ్ల‌ను వాస్తు శాస్త్రం ప్ర‌కారం నిర్మిస్తుంటారు. ఇంటి ప్ర‌హ‌రీ నుంచి మొద‌లుకుంటే.. ఇంట్లోని బెడ్రూం, వాష్‌రూమ్ వ‌ర‌కు ప్ర‌తి విష‌యంలో వాస్తు నియ‌మాల‌ను పాటిస్తుంటారు. వాస్తు నిపుణుడిని సంప్ర‌దించి త‌మ ఇంటి నిర్మాణాన్ని చేప‌డుతుంటారు. అయిన‌ప్ప‌టికీ కొన్ని ఇండ్ల‌లో ఆ కుటుంబ స‌భ్యుల‌ను వాస్తు దోషాలు వెంటాడుతూనే ఉంటాయి. మ‌రి వాస్తు దోషాలు తొల‌గిపోవాలంటే ఏం చేయాలి..? అన్న ప్ర‌శ్న వ‌చ్చిన‌ప్పుడు కొన్ని చెట్ల‌ను ఇంటి ఆవ‌ర‌ణ‌లో పెంచ‌డం వ‌ల్ల వాస్తు దోషాలు తొల‌గిపోతాయ‌ని వాస్తు పండితులు చెబుతున్నారు. మ‌రి ఆ చెట్లు ఏంటో తెలుసుకుందాం..

ఉసిరి చెట్టు

వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి సరిహద్దులో ఉసిరి చెట్టు ఉండటం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ చెట్టు మీ ఇంట్లో సానుకూల శక్తిని పెంపొందిస్తుంది. అంతేకాదు ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటుంది. కొన్ని జ‌బ్బుల‌కు ఉసిరి కాయ మెడిసిన్‌గా కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది.

అరటి చెట్టు

ఇంటి ఆవ‌ర‌ణ‌లో అరటి చెట్టును పెంచుకోవ‌డం కూడా శుభప్రదంగా భావిస్తారు. మీరు మీ ఇంటికి ఈశాన్య దిశలో అరటి చెట్టును పెంచుకోవ‌చ్చు. అరటి చెట్టుతో పాటు తులసి చెట్టును నాటితే ఫలితాలు మరింత శుభప్రదంగా ఉంటాయి.

కొబ్బరి చెట్టు

మీ ఇంటి సరిహద్దులో కొబ్బరి చెట్లను నాటితే.. అవి చాలా శుభ ఫలితాలను ఇస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇది ఇంట్లో నివసించే వ్యక్తి గౌరవాన్ని పెంచుతుంది. ఆర్థిక స్థిరత్వం కూడా లభిస్తుందని పంండితులు చెబుతున్నారు.

అశోక చెట్టు

మీరు మీ ఇంటికి ఉత్తర దిశలో అశోక చెట్టును నాటితే.. వాస్తు శాస్త్రం ప్రకారం అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. అశోక చెట్టు ఇంటి నుంచి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఇంట్లో ఆనందం, శాంతి ఉంటుంది.

మర్రి చెట్టు

మర్రి చెట్టును కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. మీ ఇంటికి తూర్పు దిశలో ఈ చెట్టును నాటితే, మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అయితే, ఈ చెట్టు నీడ మీ ఇంటిపై పడకూడదని గుర్తుంచుకోండి. ఈ చెట్టును ఇంటికి తూర్పు లేదా పడమర దిశలో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.