Lucky Plants | మీ ఇంట్లో ఈ ఐదు మొక్కలు పెంచుకుంటే.. మీ దశనే మారిపోతుందట..!
Lucky Plants | మీరు ఆరోగ్యంగా లేరా..? ఆర్థిక సమస్యలతో( Financial Problems ) సతమతమవుతున్నారా..? మీ దశ మారడం లేదా..? మరి ఇంకెందుకు ఆలస్యం.. మీ ఇంటి ఆవరణలో ఈ ఐదు మొక్కలు( Lucky Plants ) ఉండేలా చూసుకోండి.. సిరిసంపదలు, సుఖసంతోషాలు వెల్లివిరియడంతో పాటు మీ దశ మారిపోవడం( Life Change ) ఖాయం..!

Lucky Plants | చాలా మందికి తమ ఇంటి ఆవరణలో మొక్కలు( Plants ), వివిధ రకాలను చెట్లను( Trees ) పెంచుకోవడం అలవాటుగా ఉంటుంది. కొందరికి ఇష్టం ఉండదు. ఇంటి ఆవరణలో చెట్లను పెంచుకోవడం వల్ల స్వచ్ఛమైన గాలి( Air ) లభించడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం( Weather ) ఉంటుంది. ఆ ఇల్లు చల్లగా ఉంటుంది. అయితే ఈ ఐదు మొక్కలు( Lucky Plants ) ఇంటి ఆవరణలో పెంచుకున్నట్లైతే ఆ నివాసంలో సుఖసంతోషాలు, సిరిసంపదలకు లోటు ఉండదని వాస్తు నిపుణులు( Vastu Experts ) చెబుతున్నారు. అసలు ఆ ఇంటి యజమాని దశనే మారిపోతదని చెబుతున్నారు. మరి ఆ ఐదు మొక్కలు ఏంటో తెలుసుకుందాం..
తులసి..( Tulasi )
హిందూ ధర్మంలో తులసి( Tulasi ) మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ఈ మొక్కను పవిత్రమైన మొక్కగా భావిస్తారు. ప్రతి రోజు ఉదయం సాయంత్రం తులసి మొక్కకు పూజలు చేస్తారు. ఇక తులసి వల్ల ఆ ప్రాంతంలో స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. దీంతో ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. శాంతి కూడా కలుగుతుంది. ఇంట్లో తులసి మొక్క పెంచుకోవడం వల్ల స్వచ్ఛతకు, రక్షణకు చిహ్నంగా నిలుస్తుంది.
మనీ ప్లాంట్..( Money Plant )
దాదాపు అందరి ఇండ్లలో మనీ ప్లాంట్( Money Plant ) కనిపిస్తుంది. ఇంటి ఆవరణలో లేదా ఇంటి లోపల మనీ ప్లాంట్‌ను పెంచుతుంటారు. చాలా తేలికగా పెరిగే ఈ మొక్కను ధనం, శ్రేయస్సుకు సంకేతంగా పరిగణిస్తారు. మనీ ప్లాంట్‌ను ఇంట్లో పెంచుకోవడం వల్ల డబ్బు సమృద్ధిగా వస్తుందని నమ్మకం. ఈ మొక్క ధనానికి సంబంధించిన ఆశయాలను బలపరిచి మంచి ఫలితాలవైపు నడిపిస్తుందని చెబుతారు.
వేప చెట్టు..( Neem Tree )
పూర్వం గ్రామాల్లో కానీ, పట్టణాల్లోని ప్రతి ఇంటి ఆవరణలో వేప చెట్టు( Neem Tree ) తప్పనిసరిగా ఉండేది. కానీ ఇప్పుడు వేప చెట్టు కనిపించడం లేదు. కానీ ఈ చెట్టును ఇంటి ఆవరణలో పెంచుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను అందివ్వడమే కాకుండా.. శుభ శక్తిని కూడా కలిగిస్తుంది. ఈ చెట్టు చెడు శక్తులను దూరం చేసి, శుభ పరిణామాల వైపు పయనింపజేసేలా చేస్తుంది.
అంజూర చెట్టు..( Anjura Plant )
అంజూర చెట్టు( Anjura Tree )కు ఆయుర్వేంతో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ చెట్టుకు శివుడితో సంబంధం ఉంది. కాబట్టి ఈ చెట్టును ఇంట్లో పెంచుకుంటే ధైర్యం కలగడమే కాకుండా.. స్థిరంగా జీవించడానికి తోడ్పడుతుంది. ఆధ్యాత్మికంగా కూడా ఎదుగుతారు. దీని బెరడు, ఆకులు ఆరోగ్య ప్రయోజనాలకు ఉపయోగపడతాయి.
అశోక చెట్టు..( Ashoka Tree )
అశోక చెట్టు( Ashoka Tree ) ప్రేమకు, ఆనందానికి చిహ్నంగా ఉంటుంది. ఈ చెట్టు పువ్వులు మనసును ఉల్లాసంగా ఉంచుతాయి. ఇంటి దగ్గర ఈ చెట్టు పెంచితే భావోద్వేగంగా మంచిగా ఉంటాం. ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబంలో కలిసిమెలిసి ఉండే వాతావరణం ఏర్పడుతుంది.