Attached Bathroom | మీ ఇంట్లో ఎటాచ్డ్ బాత్రూం ఉందా..? మరి అది వాస్తుకే ఉందో..? లేదో..? తెలుసుకోండిలా..
Attached Bathroom | ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఇంట్లోనే పడకగదికి( Bed Room ), హాల్‌కు ఎటాచ్డ్ బాత్రూమ్( Attached Bathroom )లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ ఎటాచ్డ్ బాత్రూమ్స్ వాస్తు( Vastu ) ప్రకారం నిర్మించుకోకపోతే అనేక సమస్యలు వెంటాడుతాయని వాస్తు నిపుణులు( Vastu Experts ) హెచ్చరిస్తున్నారు.

Attached Bathroom | పూర్వకాలంలో బాత్రూమ్స్( Bath Rooms ) ఇంటి బయట ఉండేవి. కానీ ప్రస్తుతం ఇంట్లోనే బాత్రూమ్స్ నిర్మించుకుంటున్నారు. పడకగదికి( Bed Room ) తప్పనిసరిగా ఎటాచ్డ్ బాత్రూం( Attached Bathroom )ఏర్పాటు చేసుకుంటున్నారు. హాల్‌లో కూడా బాత్రూమ్స్( Bath Rooms ) నిర్మిస్తున్నారు. అయితే ఇంటినంతా వాస్తు( Vastu ) ప్రకారం నిర్మించినా.. వాస్తు రీత్యా బాత్రూం కట్టకపోతే దాని ప్రభావం ఆ ఇంటిపై పడుతుందని వాస్తు నిపుణులు( Vastu Experts ) హెచ్చరిస్తున్నారు.
బాత్రూం నిర్మాణాలకు వాస్తు నియమాలు ఇవే..
నైరుతి(Southwest ) దిశలో పడకగదిని ఏర్పాటు చేయడం శుభకరం. కాబట్టి ఈ గదిలో తూర్పు వైపుగా దక్షిణం గోడకి ఆనుకునేలా ఎటాచ్డ్ బాత్రూం( Attached Bathroom ) నిర్మించుకోవాలి. బాత్రూం దక్షిణ గోడకు వెంటిలేటర్ అమర్చుకోవాలి. పశ్చిమ – వాయవ్యం దిశల్లో బాత్రూం తలుపును అమర్చుకోవాలి.
నైరుతి వైపు డబుల్ బెడ్రూం రూమ్( Double Bed Room ) నిర్మించాలనుకున్నప్పుడు ముందు ఒక గది కట్టి దానికి తూర్పు వైపు రెండు బాత్రూమ్‌లు( Bath Rooms ) నిర్మించుకోవాలి. రెండో బాత్రూమ్‌ను ఆనుకొని తూర్పు వైపు మరొక పడకగది నిర్మించుకోవాలి. ఈ కట్టడమంతా దక్షిణం గోడకు ఆనుకోనేలా ఉండాలి.
అదే విధంగా నైరుతి వైపు నుంచి తూర్పు భాగం వైపు, దక్షిణ గోడని ఆనుకొని నిర్మించుకున్న బెడ్రూం( Bed Room )లో దక్షిణం వైపు తలలు ఉండేలా పడక మంచాలను ఏర్పాటు చేసుకోవాలి. నిద్ర లేవగానే ఉత్తర దిశను చూసి, అనంతరం పశ్చిమ – వాయవ్య దిశల్లో నడుస్తూ బాత్రూమ్‌కు వెళ్లాలి.