Bell Ring in Temple | ఆల‌యంలో గంట ఎప్పుడు మోగిస్తే మంచిదో తెలుసా..?

Bell Ring in Temple | ఆల‌యానికి( Temple ) వెళ్లిన ప్ర‌తి ఒక్క‌రూ అక్క‌డున్న గంట‌( Bell )ను మోగించ‌కుండా బ‌య‌ట‌కు రారు. కానీ ఆల‌యానికి వెళ్లిన వేళ ఎప్పుడు గంట( Bell Ring ) కొడితే మంచిదో కూడా తెలుసుకోవాలి. ఎప్పుడంటే ఎప్పుడు గంట మోగించ‌డం( Bell Ring ) మంచిది కాద‌ని ఆల‌య అర్చ‌కులు సూచిస్తున్నారు.

Bell Ring in Temple | ఆల‌యంలో గంట ఎప్పుడు మోగిస్తే మంచిదో తెలుసా..?

Bell Ring in Temple | ఆల‌యానికి( Temple ) వెళ్లి ప్ర‌తి ఒక్క‌రూ ఎందుకు గంట( Bell ) మోగిస్తారు..? ఎప్పుడు గంట మోగించాలి..? అస‌లు ఆల‌యంలో కానీ, ఇంట్లో కానీ పూజ చేసిన‌ప్పుడు గంట ఎందుకు మోగించాలి..? మ‌రి నిర్దిష్ట స‌మ‌యంలో గంట మోగిస్తే( Bell Ring ) క‌లిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం..

పూజ ప్రారంభం నుంచి పూర్త‌య్యే వ‌ర‌కు ఒక నిర్దిష్ట‌మైన స‌మ‌యంలో గంట మోగించాల‌ని( Bell Ring ) అర్చ‌కులు సూచిస్తున్నారు. ఈ యుగంలోనే కాదు గడిచిన యుగాల్లోనూ గంటకు ప్రాముఖ్యత ఉంది. స్కాంద పురాణం, అగ్ని పురాణం, తంత్ర గ్రంథాల్లో పూజలో గంట ప్రాముఖ్యత గురించి ఉంది. అందుకే పూజ సంబంధిత వస్తువులో గంటను తప్పని సరిగా ఉంచుతారు. ఈ శబ్ధం ప్రతికూల శక్తులను తొలగిస్తుందని భావిస్తారు.

ఇంత‌టీ ప్రాధాన్య‌త క‌లిగిన గంట‌ను మోగించేందుకు నిర్దిష్ట స‌మ‌యం ఉన్న‌ట్లు ఆల‌య అర్చ‌కులు చెబుతున్నారు. ఆలయంలోకి ప్రవేశించగానే గంటను మోగిస్తే శరీరం, మనసు స్వచ్ఛమవుతుంది. మనసు దేవుడిపై కేంద్రీకృత‌మ‌వుతుంది. గుడి నుంచి బయలుదేరేముందు గంట మోగిస్తే మీ సందేశం నేరుగా ఆ దేవుడిని చేరుతుంది. ఫలితంగా మీ కోర్కెలు త్వరగా నెరవేరుతాయట. ఇక పూజ సమయంలో అంటే..పూజ పూర్తైన తర్వాత హారతి ఇచ్చేటప్పుడు గంట మోగిస్తారు. ఇంట్లో పూజల సమయంలోనూ పూజ ప్రారంభానికి ముందు భగవంతుడిని ఆహ్వానిస్తూ గంట మోగిస్తారు. పూజ అనంతరం హారతి ఇచ్చే సమయంలో గంట మోగిస్తారు.