Black pepper | ప్రతి ఇంట్లో పాజిటివ్, నెగిటివ్ ఎనర్జీలు ఉంటాయి. ఈ ఎనర్జీల వల్ల కుటుంబంలో మంచి, చెడు సమస్యలు తారసపడుతుంటాయి. మరి ముఖ్యంగా మనకు తెలియకుండానే మనకు శత్రువులు ఏర్పడడం, ఆర్థిక సమస్యల్లో కూరుకుపోవడం, ఏ పని చేపట్టినా ఆటంకం కలగడం వంటివి చూస్తుంటాం. అయితే వంటింట్లో లభించే మిరియాలతో( Black pepper ) శత్రువులను జయించడమే కాకుండా, ఆర్థికంగా కూడా నిలదొక్కుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు.
మరి ముఖ్యంగా మన మీద ఇతరులు ఎవరైనా దుష్ట శక్తులను ప్రయోగిస్తున్నారని అనుమానం కలిగినప్పుడు మనకు వెంటనే మిరియాలు గుర్తుకు రావాలి. ఎందుకంటే ఆ దుష్ట శక్తులను అడ్డుకునే పవర్ మిరియాలకు ఉంది. మన మీదకు దూసుకువచ్చే దుష్ట శక్తులను మిరియాలు దూరం చేసి.. రక్షణ కవచంగా మనకు అండగా నిలుస్తాయట. అంటే మనకు శత్రు బాధలు ఉండవన్న మాట. మరి ఈ శత్రు బాధ తొలగిపోవాలంటే.. చిన్న పరిహారం చేయాలి. అదేంటంటే.. పని మీద బయటికి వెళ్లేటప్పుడు తొమ్మిది మిరియపు గింజలు నోట్లో వేసుకుని నములుతూ వెళ్ళాలి. ఇలా చేయడం ద్వారా ఎలాంటి శత్రు బాధలున్నా వాటి నుంచి సులభంగా బయటపడవచ్చు.
ఆర్థిక బాధల నుంచి కూడా ఉపశమనం..
ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారు కూడా మిరియాలతో ఆ సమస్యలను గట్టెక్కవచ్చు. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే.. ఆదివారం సాయంత్రం లేదా అమావాస్య రోజు అద్భుతమైన పరిహారం పాటించాలి. అది కూడా సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల మధ్యనే చేయాలి. ఏం చేయాలంటే.. అభ్యంగ స్నానమాచరించి.. తొమ్మిది మిరియాలను చేతిలోకి తీసుకోవాలి. ఇంటి బయటకు వచ్చి.. వాటిని క్లాక్ వైస్ దిశలో తొమ్మిది సార్లు తిప్పాలి. ఆ తర్వాత యాంటీ క్లాక్ వైస్ దిశలో తొమ్మిది సార్లు తిప్పాలి. అనంతరం, ఒక్కొక్క దిక్కు వైపు ఒక్కొక్క మిరియాన్ని విసిరేస్తూ “ఓం, ఓం, ఓం” అనే మంత్రాన్ని పఠించాలి. తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము, ఈశాన్యము, ఆగ్నేయము, వాయువ్యము, నైరుతి.. ఈ ఎనిమిది దిక్కులలో ఒక్కో మిరియాన్ని వేయాలి. ఎనిమిది దిక్కులలో మిరియాలు వేసిన తర్వాత, తొమ్మిదవ మిరియాన్ని ఆకాశం వైపు విసిరేస్తూ “ఓం, ఓం, ఓం” అని పఠించాలి. తొమ్మిది మిరియాలు విసిరిన తర్వాత, కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి ప్రవేశించాలి. దీంతో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి.. అష్టైశ్వర్యాలు సిద్దించే అవకాశం ఉంది.
