11.05.2024 శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి గ్ర‌హ సంచారం అద్భుతం..!

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

11.05.2024 శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి గ్ర‌హ సంచారం అద్భుతం..!

మేషం

మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి ఈ రోజు మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్ధికంగా బలపడుతారు. ఉద్యోగులు గట్టి పోటీని ఎదుర్కొంటారు. సన్నిహితులతో జాగ్రత్తగా మాట్లాడండి. లేకుంటే వివాదాలు రావచ్చు.

వృషభం

నూతన అవకాశాల కోసం అన్వేషించండి. చేసే పనిలో, తీసుకునే నిర్ణయాలలో స్పష్టత ఉండాలి. స్థిరాస్తి రంగం వారు ముఖ్యమైన దరఖాస్తులపై మీద సంతకాలు గానీ, కొత్త ప్రాజెక్టులు చేపట్టడం చేయకండి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకోండి.

మిథునం

మిధున రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉండబోతోంది. అన్ని రంగాల వారికి సర్వత్రా అనుకూలత ఉంటుంది. బంధుమిత్రులతో విందువినోదాల్లో పాల్గొంటారు. ఖర్చులు ఆదాయాన్ని మించకుండా జాగ్రత్త పడండి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉండదు. అనవసర ఆందోళనలు మానసిక అశాంతికి కారణమవుతాయి. బంధువర్గంతో కలహాలతో విసుగు చెందుతారు. ఆర్ధిక సమస్యలు పెరుగుతాయి. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మేలు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు గ్రహ సంచారం అద్భుతంగా ఉంది. సరదాగా సంతోషంగా ఈ రోజంతా గడుపుతారు. సంపద శక్తి ఏమిటో మీరు ఈ రోజు తెలుసుకుంటారు. సమయాన్ని వృథా చేయకండి. ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం, ఉద్యోగం ఏ రంగంలోని వారికైనా సర్వత్రా విజయమే! వృత్తిపరమైన అభివృద్ధి, పదోన్నతి ద్వారా ఆదాయం వృద్ది చెందుతుంది. ఉద్యోగులు ప్రమోషన్లు పొందుతారు.

తుల

తులా రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. వ్యాపారస్తులు మంచి లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు తమ సహోద్యోగుల సహకారం ఉంటుంది. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో తీర్ధ యాత్రలకు వెళతారు.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు గ్రహ సంచారం అనుకూలంగా లేనందున అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొత్త ప్రణాళికలు వాయిదా వెయ్యండి. ఆర్థిక సంక్షోభం ఉండవచ్చు కాబట్టి ఖర్చులు వాయిదా వెయ్యండి. నూతన ఆదాయ వనరుల కోసం ప్రయత్నించండి.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. వృత్తిలో, ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి మంచి సహకారం అందుతుంది. వ్యాపారులకు వ్యాపారంలో పురోగతి ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు సాధిస్తారు. అనేక రకాలుగా ధనాదాయం ఉంటుంది.

మకరం

మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు, వృత్తి నిపుణులు, అందరికీ ఈ రోజు చేసే పనుల్లో పురోగతి ఉంటుంది. ఆకస్మిక ధనాదాయం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, వృత్తిపరమైన జీవితంలో అంతటా ఆనందమే.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వీలైనంత వరకు అందరితో కలిసిమెలిసి ఉంటే కార్యజయం ఉంటుంది. ఎదుటివారి బలహీనతను మీ బలంగా మార్చుకోగల మీ ప్రతిభతో ఎదురుచూడని విజయాన్ని సొంతం చేసుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.

మీనం

మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి నిపుణులు, స్థిరాస్తి రంగం వారు నూతన ప్రాజెక్టులను చేపడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో స్థిరత్వం లోపిస్తుంది. ఉద్యోగస్తుల తోటి ఉద్యోగుల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి.