IRCTC | మంచు కొండలు, తులిప్ పూల అందాలు చూడాలనుకుంటున్నారా.. హైదరాబాద్ నుంచి కాశ్మీర్‌కు ఐఆర్‌సీటీసీ స్పెషల్ ట్రావెల్ ప్యాకేజీ!
IRCTC Kashmir Tour Package | ఈ వేసవిలో కాశ్మీర్ అందాలు, తులిప్ పరిమళాలు ఆస్వాదించేందుకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గామ్, తులిప్ ఫెస్టివల్ చూడవచ్చు.
“కాశ్మీర్ తులిప్ పూల అందాలు, దాల్ సరస్సులో శికారా ప్రయాణం – IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ”
IRCTC Kashmir Tour Package | ఈ వేసవిలో కాశ్మీర్‌లో మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతాలు, తులిప్ (Tulip) పూల పరిమళాలను ఆస్వాదించాలని అనుకుంటున్నారా? మీలాంటి ఔత్సాహికుల కోసం ఐఆర్‌సీటీసీ మంచి అవకాశం కల్పించింది. ‘మిస్టికల్ కాశ్మీర్ తులిప్ ఫెస్టివల్ స్పెషల్’ (Mystical Kashmir Tulip Festival Special ) పేరుతో హైదరాబాద్ (Hyderabad) నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. మార్చి 26వ తేదీన హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ పర్యటనలో శ్రీనగర్(Srinagar), గుల్మార్గ్(Gulmarg), సోనమర్గ్(Sonmarg), పహల్గామ్(Pahalgam) వంటి కశ్మీర్ అందాలను ఆస్వాదించే అవకాశం ఉంది.
ఆరు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 26వ తేదీన హైదరాబాద్ నుంచి విమానంలో బయల్దేరి శ్రీనగర్ చేరుకుంటారు. ఐదు రాత్రులు, ఆరు రోజుల పర్యటన అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఈ ప్యాకేజీ కంఫర్ట్ క్లాస్‌లో అందుబాటులో ఉంది.
ప్యాకేజీ ధరలు ఎంతంటే..
ఈ టూర్ (IRCTC Kashmir Tour Package) కోసం ఐఆర్‌సీటీసీ పెద్దల నుంచి ఒక్కొక్కరికీ రూ.53,565 (సింగిల్ ఆక్యుపెన్సీ) వసూలు చేస్తుంది. అదే డబుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.43,435; ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.42,010 చార్జ్ చేస్తున్నారు. ఇక ఐదు నుంచి 11 సంవత్సరాల లోపు పిల్లలకు బెడ్‌తో అయితే రూ.36,520; బెడ్ లేకుండా అయితే రూ.33,905 చార్జ్ చేస్తున్నారు.
రోజు వారీ టూర్ ప్లాన్ ఇదీ
మొదటి రోజు: హైదరాబాద్ నుంచి విమానంలో బయల్దేరి శ్రీనగర్ చేరుకుంటారు. అక్కడ హోటల్‌లో చెక్ ఇన్ చేసి విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం స్వేచ్ఛగా గడపవచ్చు. రాత్రికి అదే హోటల్‌లో డిన్నర్ ఉంటుంది.
రెండో రోజు: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అనంతరం శ్రీనగర్ నుంచి సముద్ర మట్టానికి 2800 మీటర్ల ఎత్తులో ఉండే సోనమర్గ్‌కు బయల్దేరి వెళ్తారు. మార్గమధ్యలో మంచుతో కప్పబడిన పర్వతాలు, నదులు, లోయలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. థాజివాస్ గ్లేసియర్ ఈ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. సోనమర్గ్ సందర్శన అనంతరం రాత్రికి శ్రీనగర్ చేరుకుని అక్కడే హోటల్‌లో బస చేస్తారు.
మూడో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం గుల్మార్గ్‌కు వెళ్లి ప్రపంచంలోనే ఎత్తైన గోండోలా కేబల్ కారు ప్రయాణం చేయవచ్చు. ఖిలన్‌మార్గ్ ట్రెక్కింగ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. దాని తర్వాత మళ్లీ శ్రీనగర్ హోటల్‌కు చేరుకుని బస చేస్తారు.
నాలుగో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం చెక్‌అవుట్ చేసి పహల్గామ్‌కు బయల్దేరి వెళ్తారు. సముద్రపు మట్టానికి 2440 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రదేశానికి వెళ్తున్న సమయంలో కుంకుమపువ్వు తోటలు, అవంతిపురం శిథిలాలు చూడవచ్చు. ఇక్కడి బీటాబ్ వ్యాలీ, అరు వ్యాలీ వంటి ప్రదేశాలు ఆకట్టుకుంటాయి. రాత్రికి పహల్గామ్‌లోనే డిన్నర్ చేసి, బస చేస్తారు.
ఐదో రోజు: బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ చెక్‌అవుట్ చేసి పహల్గామ్ నుంచి శ్రీనగర్‌కు బయల్దేరతారు. శంకరాచార్య ఆలయం, దాల్ సరస్సును సందర్శిస్తారు. దాల్ సరస్సులో శికారా రైడ్‌లో సూర్యాస్తమయాన్ని ఆస్వాదించవచ్చు. రాత్రికి బోట్ హౌస్‌లోనే బస ఏర్పాటు చేస్తారు.
ఆరో రోజు: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అనంతరం మొఘల్ గార్డెన్స్, బొటానికల్ గార్డెన్, షాలిమార్ గార్డెన్స్ సందర్శిస్తారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.
ప్యాకేజీలో ఉండే సదుపాయాలు
* హైదరాబాద్ – శ్రీనగర్ రౌండ్ ట్రిప్ విమాన టికెట్లు
* నాలుగు రాత్రులు హోటల్‌లో + ఒక రాత్రి హౌస్ బోట్‌లో వసతి
* బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్
* స్థానిక దర్శనాలకు వాహన సదుపాయం
* టూర్ ఎస్కార్ట్ సేవలు
* ట్రావెల్ ఇన్సూరెన్స్
* టోల్, పార్కింగ్, పన్నులు
ప్యాకేజీలో లేని సదుపాయాలు
* గొండోలా రైడ్, శికారా రైడ్ చార్జీలు
* మధ్యాహ్న భోజనం
* వ్యక్తిగత ఖర్చులు
* టిప్స్, గైడ్ చార్జీలు
* హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్టు వరకు ట్రాన్స్‌పోర్ట్
ముఖ్య నిబంధనలు
ఈ పర్యటనకు సంబంధించి విమాన సమయాలు మారే అవకాశం ఉంటుంది. హోటల్ చెక్ ఇన్, చెక్ అవుట్ సమయాలు హోటల్ నిబంధనల ప్రకారం ఉంటాయి. పర్యాటకులు తప్పనిసరిగా ఒరిజినల్ ఐడీ కార్డు తెచ్చుకోవాలి. ప్యాకేజీ ధరలు పరిస్థితుల ఆధారంగా మారుతుంటాయి. ఈ సమ్మర్‌లో కశ్మీర్ అందాలను చూసే అవకాశం మిస్ చేసుకోకండి.. పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఐఆర్‌సీటీసీ తెలిపింది.
Read More:
IRCTC Royal Nepal Package | హైదరాబాద్ నుంచి నేపాల్ టూర్.. ఐఆర్‌సీటీసీ కొత్త ట్రావెల్ ప్యాకేజీ
IRCTC Andaman Package | హైదరాబాద్ నుంచి అండమాన్ టూర్.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram