Horoscope | బుధవారం రాశిఫలాలు.. ఈ రాశివారు ప్రయాణాలు వాయిదా వేస్తే బెటర్..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి పనిభారంతో పాటు ఒత్తిడి కూడా పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. సహనంతో ఉండాలి. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. చక్కటి ప్రణాళికతో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా శుభయోగాలున్నాయి. వ్యాపారులకు ధనలాభాలున్నాయి.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆస్తులు వృద్ధి చేస్తారు. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఊహించని ధనలాభాలు ఉంటాయి. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. విహారయాత్రలకు వెళ్తారు.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ పెరగకుండా చూసుకోండి. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.
కన్య (Virgo)
కన్యా రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప విజయాలు సాధిస్తారు. వ్యాపారులకు వారి భాగస్వాములకు మధ్య చాలా అనుకూలత ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆచి తూచి అడుగేయాలి. అధికారులతో వినయంగా వ్యవహరించాలి. కుటుంబ కలహాలు తీవ్రస్థాయికి చేరుకుంటాయి.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. సమాజంలో హోదా పెరుగుతుంది. భూ, గృహ, వాహన యోగాలున్నాయి. వ్యాపారులు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఆశించిన ఫలితాల కోసం తీవ్రంగా శ్రమించాలి. ఆర్థికంగా ఎదగడానికి చేసే ప్రయత్నాలు ఫలించవు. సహనంతో ఉండండి. అనుకోని రీతిలో వ్యాపారంలో నష్టాలు వస్తాయి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి అధికారుల సహకారం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ప్రణాళికాబద్ధంగా పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. ఆటంకాలు అధిగమిస్తారు. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల మద్దతు ఉంటాయి. వృత్తి పరంగా పురోగతి సాధిస్తారు. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి అనువైన సమయం.
మీనం (Pisces)
మీన రాశి వారికి మీరు ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. మానసికంగా ప్రశాంతంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. కొత్త పనులు ప్రారంభించడానికి అనువైన సమయం.