Horoscope | శనివారం రాశిఫలాలు.. ఈ రాశివారికి సన్నిహితులతో వివాదాలు..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బుద్ధిబలంతో చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. కీలక వ్యవహారాల్లో చిన్న చిన్న పొరపాట్లే నష్టం కలిగించవచ్చు. ఏకాగ్రత, పట్టుదల సడలకుండా చూసుకోండి. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలలో ఆచి తూచి అడుగేయాలి.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు దక్కుతాయి. చేపట్టిన పనుల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే విజయాలు సొంతమవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. కుటుంబంలో వివాదాలు రాకుండా జాగ్రత్త పడండి.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతి సాధిస్తారు. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. స్థిరాస్తి యోగం ఉంది. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు వృత్తికి ఆటంకంగా మారుతాయి. కుటుంబంలో అపార్ధాలు, వివాదాలు చోటుచేసుకోవచ్చు. ఖర్చులు, రుణాలు పెరుగుతాయి. నిగ్రహాన్ని కోల్పోకండి. ఉద్యోగ వ్యాపారాలలో ఆచి తూచి నడుచుకోవాలి.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో మంచి ధనయోగం ఉంది. ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉంటాయి. పొదుపుపై దృష్టి సారిస్తే మంచిది. సన్నిహితులతో వివాదాలు రాకుండా కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. భూ, గృహ యోగాలున్నాయి. స్థిరాస్తుల్లో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు శ్రేష్టమైన సమయం. పెట్టుబడులు, లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఉద్యోగంలో కొన్ని ఆటంకాలు ఉండవచ్చు. మాట్లాడే మాటల్లో స్పష్టత అవసరం. కొన్ని విషయాలు ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. సమస్యల పరిష్కారానికి శాంతం, సహనం అవసరం.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. లక్ష్యం వైపు సూటిగా పయనించ గలిగితే విజయం సిద్ధిస్తుంది. సమయస్ఫూర్తితో తీసుకునే నిర్ణయాలతో ఉద్యోగ వ్యాపారాలలో మేలు జరుగుతుంది. ఆర్థికంగా అనుకూలమైన సమయం. పొదుపు పాటించండి. కీలక వ్యవహారాల్లో ధైర్యంగా ముందడుగు వేస్తే విజయం తప్పకుండా సిద్ధిస్తుంది.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు అధికారులతో ఆచి తూచి నడుచుకోవాలి. ఆర్థికంగా పురోగతి ఉన్నప్పటికీ ఖర్చులు పెరిగే ప్రమాదముంది. వాహన ప్రమాదాలకు ఆస్కారం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. ఉద్యోగంలో లాభదాయక ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. నూతన వాహన యోగం ఉంది.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్, ఆర్థిక లాభాలు, అధికారుల ప్రశంసలు ఉంటాయి. బంధుమిత్రులతో విహారయాత్రలకు వెళ్తారు. న్యాయపరమైన వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ఫలితాల కోసం తీవ్రంగా కృషి చేయాలి. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. అనారోగ్యం పనులకు ఆటంకంగా మారుతుంది. కొందరి ప్రవర్తన మనస్థాపం కలిగిస్తుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు మేలు చేస్తాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram