23.05.2024 గురువారం రాశిఫ‌లాలు.. మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - May 23, 2024 / 06:31 AM IST

మేషం

మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల్లో ఇబ్బందులు కలిగే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక ప్రయోజనాలు మెరుగ్గా ఉంటాయి. ఈ రోజు గ్రహసంచారం అంత అనుకూలంగా లేనందున కొత్తగా ఏ పనులు మొదలు పెట్టవద్దు. మాట్లాడే ప్రతి మాట ఆచి తూచి మాట్లాడాలి.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొన్ని రోజులుగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. సమాజంలో గౌరవం, ప్రతిష్ట పొందుతారు. అనుకోని విధంగా సంపదలు కలిసివస్తాయి.

మిథునం

మిధున రాశి వారికి ఈ రోజు విజయవంతంగా ఉంటుంది. ఇంటా బయట ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాలవారు ఈ రోజు అన్ని పనులు విజయవంతం పూర్తి చేస్తారు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం లభిస్తుంది.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యపై శ్రద్ధ అవసరం. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు సహనం కోల్పోకండి. ఉద్యోగస్తులకు, వృత్తి వ్యాపార నిపుణులకు శ్రమకు తగిన ఫలం ఉండదు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవసరానికి మించిన ఆవేశం, మితిమీరిన ఆత్మవిశ్వాసం కారణంగా సన్నిహితులతో వివాదాలు రావచ్చు. ముఖ్యమైన డాకుమెంట్లపై సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించండి. ఆర్ధిక ప్రయోజనాలు ఆశించిన మేరకు ఉండకపోవచ్చు.

కన్య

కన్యా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పెండింగ్ పనులను గట్టి పట్టుదలతో పూర్తి చేస్తారు. కుటుంబంలో చిన్నా చితకా చికాకులు ఉన్నా సహనంతో ఉంటే సర్దుకుంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు శుభ పరిణామాలు జరుగుతాయి.

తుల

తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు ఆశించిన ప్రయోజనాలు ఉండవు. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. ఇతరుల మాటలకు ప్రలోభపడకండి. మీ సొంత ఆలోచనతో ముందుకెళితే కార్యసిద్ధి ఉంటుంది.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. సమీప బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. గృహంలో శాంతి సౌఖ్యం నెలకొంటాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగ నిపుణులు మంచి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారులు కొత్త వ్యాపారాలను ప్రారంభించి లాభాలు అందుకుంటారు.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. మీ మాటతీరు కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్యం సహకరించదు. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. అదనపు ఆదాయం కోసం ప్రయత్నిస్తారు.

మకరం

మకర రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. అవివాహితులకు వివాహం నిశ్చయం కావచ్చు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. స్దాన చలనం కూడా ఉండవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనుకోని ఆపదలో చిక్కుకుంటారు. అయితే దైవబలం కాపాడుతుంది. ఆరోగ్యం విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులకు భాగస్వాములతో సమస్యలు పరిష్కారమవుతాయి.

మీనం

మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముందు వెనుక చూడకుండా మాట్లాడి తగాదాలు తెచ్చుకోవద్దు. ఇంట్లో అశాంతి నెలకొంటుంది. ప్రతికూల ఆలోచనలు వీడండి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది.

Latest News