Horoscope | గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి జీవిత భాగ‌స్వామితో వివాదాలు..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Horoscope | గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి జీవిత భాగ‌స్వామితో వివాదాలు..!

మేషం (Aries)

మేషరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు బుద్ధిబలంతో అధిగమిస్తారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్యమైన చర్చలు ఫలవంతంగా వుంటాయి.

వృషభం (Taurus)

వృషభరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో విజయావకాశాలు మెరుగవుతాయి. నూతన అవకాశాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తి కలిగిస్తుంది. సుదూర ప్రాంతాలకు తీర్థయాత్రల కోసం వెళ్తారు.

మిథునం (Gemini)

మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి ఉద్యోగ వ్యాపారాలలో ఆచి తూచి అడుగేయాలి. వివాదాలు, వాదనలకు దూరంగా వుండండి. ఆర్థికంగా కొన్ని సమస్యలు ఉండవచ్చు.

కర్కాటకం (Cancer)

కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి ప్రతికూలతలు లేని మంచిరోజు. ఈ రోజంతా కుటుంబ వేడుకల్లో సరదాగా, సంతోషంగా గడుపుతారు. బుద్ధిబలంతో ఆర్థిక వ్యవహారాలు చక్కబెడతారు.

సింహం (Leo)

సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలను బుద్ధిబలంతో అధిగమిస్తారు. ఆపదలు తొలగుతాయి. కోపావేశాలు అదుపులో ఉంచుకోండి. కీలక వ్యవహారాల్లో మొండి పట్టుదలకు పోకుండా సందర్భానుసారం నడుచుకుంటే మంచిది.

కన్య (Virgo)

కన్యారాశి వారికి ఈ రోజు సామాన్య ఫలితాలు వుంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. సహనంతో నడుచుకుంటే మంచిది. కీలక నిర్ణయాలలో చంచలత్వం పనికిరాదు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం.

తుల (Libra)

తులారాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. గతంలో మానసిక ఒత్తిడి కలిగించిన సమస్యలు తొలగిపోతాయి. అన్ని రంగాల వారికి అదృష్ట ఫలితాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో మంచి జరుగుతుంది.

వృశ్చికం (Scorpio)

వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మీ బుద్ధిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబాభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగ వ్యాపారాలలో స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప విజయాలు సాధిస్తారు. ఆర్థికంగా శుభ యోగాలున్నాయి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పెద్దల సహకారంతో వృత్తి పరమైన ఆటంకాలను అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో పట్టుదల, ఏకాగ్రత పెంచాలి. ఒక సంఘటన విచారం కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో స్వల్ప వివాదాలు ఉండవచ్చు.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు అనుకూలమైన ఆరోజు. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. అవసరాలకు సరిపడా ఆదాయం లభిస్తుంది. వ్యాపారులకు రుణభారం తొలగిపోతుంది.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో తీరిక లేని పనులతో పనిఒత్తిడి, శ్రమ పెరగవచ్చు. పెండింగ్ పనుల్లో నిమగ్నమై ఉంటారు. కీలక వ్యవహారాల్లో బంధుమిత్రుల సలహాలు పని చేస్తాయి. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల ఖర్చులు పెరుగుతాయి.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శ్రేష్టమైన శుభ సమయం నడుస్తోంది. సామాజిక సంబంధాలు మెరుగు పడతాయి. ఉద్యోగంలో మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు ఆనందం కలిగిస్తాయి.