Budhaditya Raj yoga | 100 ఏళ్ల తర్వాత బుధాదిత్య రాజయోగం..! ఈ నాలుగు రాశుల వారు కొత్త ఇల్లును కొనడం ఖాయం..!!
Budhaditya Raj yoga | జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయిక అనేది సహజం. ఒక రాశిలో నుంచి మరో రాశిలోకి గ్రహాల సంచారం జరుగుతూనే ఉంటుంది. అయితే గ్రహాల్లో రాజు అయిన సూర్యుడు( Sun ) మకర సంక్రాంతి రోజున మకర రాశిలోకి ప్రవేశించాడు. దీంతో బుధాదిత్య రాజయోగం( Budhaditya Raj yoga ) ఏర్పడి ఈ నాలుగు రాశులకు( Zodiac Signs ) ఊహించని విధంగా ఆదాయం సమకూరడంతో పాటు కొత్త ఇల్లు( New House )ను తప్పకుండా కొంటారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఆ నాలుగు రాశులేవో ఈ కథనంలో తెలుసుకుందాం.
Budhaditya Raj yoga | సూర్యుడి( Sun ) మకర సంక్రమణం జరిగే సమయంలో ధనస్సు రాశిలోని బుధుడితో కలుస్తాడు. ఈ కారణంగా బుధాదిత్య రాజయోగం( Budhaditya Raj yoga ) ఏర్పడుతుంది. ఈ అద్భుతమైన కలయిక 100 ఏండ్ల తర్వాత జరుగుతుంది. ఇది 12 రాశులపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కానీ ఈ నాలుగు రాశుల( Zodiac Signs ) వారికి మాత్రం ఊహించని లాభాలు ఉన్నాయంట. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయట. కొత్త ఇల్లు( New House 0 తప్పకుండా కొనుగోలు చేస్తారట. మరి ఆ నాలుగు రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషం (Aries)
బుధాదిత్య రాజయోగం వలన మేష రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఇక వీరికి అద్భుతమైన సమయం నడుస్తోంది. వీరికి 9వ ఇంటిలో రాజయోగం ఏర్పడుతుంది. దీంతో వీరు పెట్టిన పెట్టుబడుల్లో భారీ మొత్తంలో లాభాలు గడిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. నూతన గృహ యోగం ఉంది.
కన్య (Virgo)
సూర్యుడి ఆశీస్సుల కారణంగా కన్యారాశి వారికి కూడా అత్యంత అనుకూల సమయం నడుస్తోంది. చేపట్టిన ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసి లాభాల బాట పడుతారు. వీరికి నాలుగో ఇంటి లోపల సూర్య, బుధుల కలయిక జరగడం వల్ల అద్భుతమైన లాభాలు చేకూరనున్నాయి. మరి ముఖ్యంగా కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.
వృషభం (Taurus)
బుధాదిత్య రాజయోగం వల్ల వృషభ రాశి వారికి కూడా కలిసి వస్తుంది. వీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం మెండుగా ఉంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు మంచి ఉద్యోగంలో జాయిన్ అవుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవిస్తారు. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. అప్పుల సమస్యలు తీరిపోయి చాలా ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి 11వ ఇంటి లోపల బుధాదిత్య రాజయోగం ఏర్పడటం వలన వీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఆర్థికంగా బాగుటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. తీర్థయాత్రలు చేసే ఛాన్స్ ఉంది. మీ దగ్గరి బంధువును కలవడం మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉండబోతుంది. ఆత్మవిశ్వాసంతో పని చేస్తారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram