Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డికి వరుస షాక్ లు.. సుశీ ఇన్ ఫ్రాపై సీబీఐ కేసు !
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబానికి డబుల్ షాక్! సుశీ ఇన్‌ఫ్రాపై ఢిల్లీ సీబీఐ కేసు నమోదు చేయగా.. మరోవైపు ఎస్ఈసీఎల్ భారీ బొగ్గు గని టెండర్‌ను రద్దు చేసింది.
విధాత : తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఇటీవల వరుస షాక్ లు ఎదురవుతున్నాయి. మహిళా ఐఏఎస్ అధికారులపై వచ్చిన వివాదస్పద మీడియ కథనాలతో వేదనకు గురైన వెంకట్ రెడ్డికి నైనీ కోల్ మైన్ టెండర్ వివాదం వెలుగులోకి రావడం మరింత ఇబ్బందికరంగా మారింది. తన సోదరుడు అనిల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్‌ఫ్రా కంపెనీకి నైనీ కోల్ మైన్ టెండర్ దక్కించేందుకు ఆయన చేసిన ప్రయత్నాల ప్రహసనమే ఈ రచ్చకంతటికి కారణమన్న వాదన వివాదాన్ని రాజకీయంగా మరో మలుపు తిప్పింది. ఇంతలోనే వెంకట్‌రెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్‌ఫ్రా కంపెనీకి షాక్ ఇస్తూ సీబీఐ కేసు నమోదు చేయడం ఆయనకు మరింత సంకటంగా తయారైంది.
కాంట్రాక్టు పనుల కోసం ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇచ్చే ప్రయత్నం చేసిందంటూ సుశీ ఇన్‌ఫ్రా కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది. సుశీ ఇన్‌ఫ్రా నేరపూరిత కుట్రకు పాల్పడిందంటూ ఢిల్లీ సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఆలస్యంగా వెలుగు చూసింది. సీబీఐ నమోదు చేసిన ఆ ఎఫ్ఐఆర్‌లో మంత్రి కోమటిరెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్‌ఫ్రా కంపెనీ A-15 గా ఉందని తెలుస్తుంది. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలోని పనుల కోసం అధికారులకు సుశీ ఇన్‌ఫ్రా లంచాలు ఇవ్వజూపిందని, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ సంతోష్ కుమార్‌కు భారీగా లంచాలు ఇచ్చినట్టుగా సీబీఐ అభియోగాలు మోపింది. సెక్షన్ ఇంజనీర్ సంతోష్ కుమార్ అకౌంట్లలో దాదాపు రూ.1 కోటి వరకు సుశీ ఇన్‌ఫ్రా లంచాలు జమ చేసినట్లుగా సీబీఐ విచారణలో గుర్తించిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీని వెల్లడించడంతో గమనార్హం. ఢిల్లీలో కేసు నెం. RC2172023A004/CBI/AC-II నమోదు చేసిన నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే అధికారులు (1/n) వెల్లడించారు. అయితే ఈ కేసు నమోదులో కోమటిరెడ్డి బ్రదర్స్ ను బీజేపీలోకి తీసుకొచ్చే ఒత్తిడి కోణం ఏదైనా ఉందా అన్న అనుమానాలు కూడా ఆసక్తి రేపుతున్నాయి.
కోమటిరెడ్డి కుటుంబానికి ఎదురుదెబ్బ
సుశీ హైటెక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించిన బొగ్గు గని కాంట్రాక్టు టెండరు అనుమతి రద్దు కావడంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ – కోర్బా జిల్లా కుసుముందా ప్రాంతంలో 1,460 రోజుల పాటు ఉపరితల బొగ్గు గని తవ్వకాలు చేపట్టడానికి సుశీ హైటెక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎస్ఈసీఎల్ గతంలో అనుమతినిచ్చింది. గత సెప్టెంబరు 22న టెండర్ అనుమతి ఉత్తర్వులు జారీ చేసినా, ఫిక్స్డ్ డిపాజిట్ రూ.18.99 కోట్లు, అదనపు పీఎస్ఓ కింద మరో రూ.108.83 కోట్లను సుశీ ప్రాజెక్ట్స్ చెల్లించలేదని, అలాగే పనులు కూడా మొదలు పెట్టకపోవడంతో టెండర్ అనుమతి లేఖను రద్దు చేయాలని సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్ఈసీఎల్)నిర్ణయించింది.
దీంతో పాటు సుశీ ప్రాజెక్ట్స్ ఎర్నెస్ట్ డిపాజిట్ కింద చెల్లించిన రూ.50 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈసీఎల్ వెల్లడించింది. నిబంధనల ప్రకారం సుశీ కంపెనీపై ఎలాంటి పనులు జరపకుండా ఏడాది పాటు నిషేధించే హక్కు తమకు ఉందని.. సుశీ కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి తమకు అధికారముందని ఈ సందర్బంగా ఎస్ఈసీఎల్ స్పష్టం చేయడం గమనార్హం.
మంత్రి కోమటిరెడ్డి ఫ్యామిలీకి చెందిన సుశీ ఇన్‌ఫ్రా కంపెనీకి సీబీఐ షాక్
ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇస్తూ అడ్డంగా దొరికిన సుశీ ఇన్‌ఫ్రా కంపెనీ
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సుశీ ఇన్‌ఫ్రా లంచాల బాగోతం
సుశీ ఇన్‌ఫ్రా నేరపూరిత కుట్రకు పాల్పడిందంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ సీబీఐ… pic.twitter.com/9r50bW7ayx
— Telugu Scribe (@TeluguScribe) January 19, 2026
ఇవి కూడా చదవండి :
Outsourcing Corporation | ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త! టీజీ ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు యత్నాల్లో సర్కార్?
City Of Lakes | మన దేశంలో సరస్సులకు ఏ నగరం ప్రసిద్ధి చెందిందో తెలుసా..? ఆ నగర ప్రత్యేకతలు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram