నేటి రాశిఫ‌లాలు.. మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

నేటి రాశిఫ‌లాలు.. మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

మేషం

మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సహృదయంతో గతంలో చేసిన తప్పిదాలకు బాధ్యత తీసుకుని పరిస్థితులను చక్కదిద్దుతారు. భవిష్యత్​లో మీరు అందుకోబోయే విజయాలకు ఇది మంచి బాట అవుతుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆదాయం సామాన్యంగా ఉంటుంది.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాలవారు తమ తమ రంగాలలో ఎదురైనా సమస్యల కారణంగా ఒత్తిడికి లోనవుతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో పోటీ పెరగడం వల్ల పనిభారం పెరుగుతుంది.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులకు ఈ రోజు కలిసివస్తుంది. పదోన్నతులు రావడం వల్ల నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకర్షిస్తారు. వృత్తి పరంగా సీనియర్ల నుంచి సహకారం, స్ఫూర్తి అందుతాయి. అవసరానికి డబ్బు అందుతుంది.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యంగా కోపావేశాలను అదుపులో ఉంచుకోకపోతే వృత్తి పరంగా భారీ నష్టాలను చూడాల్సి వస్తుంది. తొందరపడి మాట మీరడం వలన శత్రువులు పెరుగుతారు. అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వ్యాపారంలో ఆర్థిక నష్టాలు సంభవించే సూచన ఉంది.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన అన్ని పనులు ఈ రోజు విజయవంతంగా పూర్తవుతాయి. భూమి, ఇల్లు కొనాలనుకునే వారికి ఈ రోజు శుభసమయం. లక్ష్మీకటాక్షంతో సంపదలు వృద్ధి చెందడంతో మీలో ఉత్సాహం, ఆనందం వెల్లివిరుస్తుంది. బుద్ధిబలంతో, ఆత్మవిశ్వాసంతో పనిచేసి విమర్శకులకు సరైన సమాధానం చెబుతారు.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి పనిభారం పెరుగుతుంది. వ్యాపారంలో సవాళ్లు ఎదురుకావడం వల్ల ఒత్తిడికి గురవుతారు. కుటుంబ సభ్యుల, సన్నిహితుల సహకారంతో ఒత్తిడిని అధిగమిస్తారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.

తుల

తులారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతికూల ఆలోచనల కారణంగా విజయం అందినట్లే అంది చేజారిపోతుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన మనస్తాపాన్ని కలిగిస్తుంది. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు, కొత్త అసైన్మెంట్లు మొదలుపెట్టడానికి అనుకూలంగా ఉంది. కుటుంబ వ్యవహారాలలో సమష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చిత్తశుద్ధితో లక్ష్యసాధన కోసం కృషి చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. అనవసరమైన వాదనలు, చర్చలకు దూరంగా ఉండడం మంచిది. విలాసాలకు పోయి డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు అదుపు తప్పే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా ఖర్చు చెయ్యండి. ఇంటి వాతావరణం ప్రతికూలంగా మారేలా ఉంది. గొడవలు, వాదనలు ఏర్పడకుండా సహనం వహించండి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా వృత్తి నిపుణులకు, వ్యాపారులకు ఈ రోజు ఫలప్రదం అవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జ‌ర‌గ‌డంతో ఉత్సాహంగా ఉంటారు. గృహంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. అయితే కొందరి బంధువుల ప్రవర్తన కారణంగా కుటుంబ సభ్యులతో వివాదాలు తప్పకపోవచ్చు.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో చెప్పుకోతగ్గ మార్పులేమీ ఉండవు. ఖర్చులు పెరగడం వల్ల అదనపు ఆదాయ వనరుల కోసం ప్రయత్నిస్తారు. వృత్తి నిపుణులు ప్రతిభ, నైపుణ్యాలను పెంచుకోకపోతే రాణించడం కష్టం. కుటుంబంలో ఘర్షణలు జరిగే అవకాశముంది.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఈ రోజు అన్ని రంగాల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. సృజనాత్మకంగా, క్రియేటివ్ గా పనిచేసి మీ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు. కొత్త ప్రాజెక్టులపై సంతకాలు చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.