రూ.15లక్షల లంచంతో ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ అధికారి

తెలంగాణ ఏసీబీ వలకు జీహెచ్ఎంసీ అధికారి చిక్కాడు. కూకట్‌పల్లి జోన్ ఎస్‌ఈ చిన్నారెడ్డి రూ.15 లక్షల లంచం తీసుకుంటూ అరెస్టయ్యాడు.

Reported by: Tejaswini Nanna | హైదరాబాద్​ | Feb 04, 2026, 1:51 pm IST
Read Time: 2 mins
రూ.15లక్షల లంచంతో ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ అధికారి

విధాత, హైదరాబాద్ : తెలంగాణ ఏసీబీ అధికారులు అవినీతి ఉద్యోగుల, అధికారుల ఆట కట్టించడంలో దూకుడు మీద సాగుతున్నారు. సగటున రోజుకొక్క అవినీతి అధికారులనైనా పట్టాలన్నట్లుగా దాడులు నిర్వహిస్తున్నారు. బుధవారం ఏసీబీ అధికారుల వలకు భారీ అవినీతి తిమింగలం చిక్కింది.

జీహెచ్ఎంసీ కూకట్‌పల్లి జోన్ ఎస్‌ఈ చిన్నారెడ్డి రూ. 15లక్షల లంచం తీసుకుంటు ఏసీబీ అధికారులకు చిక్కాడు. అతడిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ బృందం అనంతరం జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోనల్‌ కార్యాలయంలో తనిఖీలు చేపట్టింది.

ఇవి కూడా చదవండి :

Woman Advocate Murder : మహిళా న్యాయవాది దారుణ హత్య
Pawan Kalyan : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారం