Horoscope | శనివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఆదాయానికి మించిన ఖ‌ర్చులు..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Nov 08, 2025 6:23 AM IST
Horoscope | శనివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఆదాయానికి మించిన ఖ‌ర్చులు..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి పరంగా ఒక సువర్ణావకాశం నేడు ఎదురయ్యే అవకాశముంది. బంగారు భవిష్యత్తు ఎదురు చూస్తోంది. ఎదురైన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ధన ప్రాప్తి ఉంది.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సానుకూల దృక్పథంతో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మీ చర్యలు మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయని గుర్తుంచుకోండి. మీ వ్యక్తిత్వానికి భంగం కలిగే పనులు చేయవద్దు. చేపట్టిన పనుల్లో స్థిరత్వం అవసరం. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాల కోసం శ్రమించాలి. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ మీ కృషి, కఠిన శ్రమతో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఆర్ధిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ రంగంలో శుభవార్తలు వింటారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు, ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది.

కన్య (Virgo)

కన్యా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బంధు మిత్రుల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలున్నప్పటికీ అధిగమిస్తారు. కీలక వ్యవహారాల్లో వివేకంతో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యపరంగా ఆందోళనలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. అధిక పని ఒత్తిడితో మానసిక ఆందోళనకు గురవుతారు. పట్టుదలతో శ్రమిస్తే అనుకున్న సమయంలో పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో అవరోధాలు ఉండవచ్చు కాబట్టి వాయిదా వేస్తే మంచిది.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తీరికలేని పనులతో ఒత్తిడికి లోనవుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. కీలక సమావేశాలు, చర్చల్లో ఆచి తూచి నడుచుకోవాలి. ఆర్థికంగా పరీక్షా సమయం. మీ సహనమే మీకు శ్రీరామరక్ష. ఖర్చులు అదుపు చేసుకోండి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. శుభప్రదమైన సమయం నడుస్తోంది. వృత్తి పరంగా మీ పట్టుదల ఫలిస్తుంది. నూతన అవకాశాలు అందుకుంటారు. తలపెట్టిన పనులన్నీ సజావుగా సాగుతాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలు కోసం శ్రమించాలి. వృత్తి పరంగా తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. కుటుంబసభ్యులతో వాదనలు ఘర్షణల్లో మౌనంగా ఉండండి. అనవసర చర్చలు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తినిపుణులు, వ్యాపారులకు అనుకూలమైన రోజు. ఆర్థికంగా, వృత్తి పరంగా అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు అందుకుంటారు. ప్రయాణాలు సఫలమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రశాంతతనిస్తుంది.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పరోపకార కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారు. కొత్త వ్యక్తులను కలుస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో అధికార పరిధి పెరుగుతుంది. వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలుండవచ్చు. జీవిత భాగస్వామితో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించండి. ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండండి.