Horoscope | ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారు కోపావేశాలు అదుపులో ఉంచుకోవ‌డం బెట‌ర్..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Horoscope | ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారు కోపావేశాలు అదుపులో ఉంచుకోవ‌డం బెట‌ర్..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో అంచనాలకు మించిన శుభ ఫలితాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో మీ ఆనందాన్ని పంచుకుంటారు. ఆర్థికంగా అత్యంత శుభ ఫలితాలు ఉంటాయి.

వృషభం (Taurus)

వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలమైన రోజు. ముఖ్యమైన కార్యాల్లో విజయం సాధిస్తారు. శారీరకంగా ఆరోగ్యంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. స్నేహితులతో, కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

మిథునం (Gemini)

మిథునరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కలిసి వచ్చే కాలం. మీ ప్రతిభకు గుర్తింపు, ప్రశంసలు అందుకుంటారు. పదోన్నతులకు అవకాశం ఉంది. వ్యాపారులకు పట్టిందల్లా బంగారం అవుతుంది.

కర్కాటకం (Cancer)

కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఈ రోజంతా విచారం, ఆందోళనలతో గడిచి పోతుంది. గతంలో నిర్లక్ష్యం చేసిన సమస్యలు ఇప్పుడు ఇబ్బంది పెడతాయి. వృత్తి ఉద్యోగాలలో పురోగతి నిరాశ పరుస్తుంది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది.

సింహం (Leo)

సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు రాబట్టడానికి తీవ్రంగా శ్రమించాలి. చేపట్టిన పనుల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. కోపావేశాలు అదుపులో ఉంచుకుంటే మంచిది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.

కన్య (Virgo)

కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ఆర్థిక లాభాలు అందుకుంటారు.

తుల (Libra)

తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. బుద్ధి బలంతో కీలక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో రాజీ ధోరణి అవలంబిస్తే మంచిది.

వృశ్చికం (Scorpio)

వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. స్వీయ క్రమశిక్షణతో ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలు పొందుతారు. కుటుంబ వాతావరణం శాంతియుతంగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని సరదాగా గడుపుతారు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు చికాకు పెడతాయి. మనోధైర్యంతో ముందుకెళ్తే మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో ముందుచూపుతో వ్యవహరిస్తే సమస్యలు ఉండవు.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన శుభ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఖర్చులు బాగా పెరుగుతాయి.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో బలమైన యోగం ఉంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. హనుమాన్ చాలీసా పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. ముఖ్యంగా ఉద్యోగులు ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచి తూచి నడుచుకోవాలి.