Horoscope | బుధవారం రాశిఫలాలు.. ఈ రాశివారు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది..!
చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం
మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభసమయం నడుస్తోంది. తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. వైద్యవృత్తి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి ఫలవంతమైన రోజు.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంది. నూతనోత్సాహంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. వ్యాపారులు గొప్ప ఆత్మ విశ్వాసం, నీతి నిజాయితితో పనిచేసి మంచి పేరు, తిరుగులేని విజయాలను సాధిస్తారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారు నూతన ప్రాజెక్టులు మొదలు పెట్టటానికి శుభసమయం. చేపట్టిన ప్రతి పనిలోను పురోగతి, లాభాలు పొందుతారు. సన్నిహితులతో, ఇరుగుపొరుగువారితో గొడవలు రావచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య అపార్థాలతో మనశ్శాంతి లోపిస్తుంది. పనిభారం పెరుగుతుంది. ఉద్యోగులు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్ధిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వ్యాపారంలో ఆర్థిక నష్టాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిత్రార్జిత ఆస్తిని పొందుతారు. మోసపు మాటలతో తప్పుదోవ పట్టించే వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రతిపని శుభ ఫలితాలనిస్తుంది. తిరుగులేని విజయాలను అందుకుంటారు. ఆర్థికంగా శుభఫలితాలు ఉంటాయి. కుటుంబ కలహాలతో మనశ్శాంతి దెబ్బ తింటుంది.
తుల
తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగత జీవితంలో అనేక శుభ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి సౌభాగ్య సిద్ధి, లక్ష్మీ కటాక్షం ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. ప్రయాణాలలో ఆటంకాలు ఉండవచ్చు.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి శుభసమయం నడుస్తోంది. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే విజయసిద్ధి ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకోడానికి శుభసమయం. సంపద వృద్ధి చెందుతుంది. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉండవచ్చు. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో కొన్ని సవాళ్లు ఎదురైనా మనోబలంతో పూర్తి చేస్తారు. కుటుంబ విషయాలలో ఆత్మీయుల సలహా పాటించండి. అవసరానికి ధనం చేతికి అందుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ఉత్సాహంగా పనిచేసి తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంటారు. మీ దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసంతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉన్నత స్థానంలో నిలవాలనుకుంటే పెద్దలు సూచించిన మార్గంలో నడవడం ఉత్తమం. సంపద పెరుగుతుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు.