Motorola Edge 70 | మోటరోలా ఎడ్జ్ 70 సిరీస్ సంచలనం – సామ్‌సంగ్‌కు చుక్కలే.!
మోటరోలా ఎడ్జ్ 70 మరియు ఎడ్జ్ 70 ప్రో లీక్స్ బయటపడ్డాయి. 5.99mm అల్ట్రా-స్లిమ్ డిజైన్, 50MP కెమెరాలు, Snapdragon Gen చిప్‌సెట్, 4800mAh బ్యాటరీ, 68W ఛార్జింగ్ వంటి ఫీచర్లు. ఎడ్జ్ 70 ఇండియా ధర ₹35,000 లోపే ఉండొచ్చని సంచలన వార్త.
Motorola Edge 70 & Edge 70 Pro Leaks: Ultra-Slim Design, Top Specs, India Price Revealed
(విధాత టెక్ డెస్క్)
Motorola Edge 70 | స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 2025 చివరలోకి అడుగుపెడుతున్న ఈ సమయంలో, మోటరోలా తన కొత్త ఎడ్జ్ సిరీస్‌తో మొబైల్ ప్రపంచాన్ని మరోసారి ఆకర్షించబోతోంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో ఎడ్జ్ 70 అల్ట్రా-స్లిమ్ డిజైన్‌తో హల్‌చల్ చేస్తుండగా, భారత మార్కెట్లో ఎడ్జ్ 70 మరియు ఎడ్జ్ 70 ప్రో స్పెక్స్ ఇప్పుడు లీకుల ద్వారా బయటకు వచ్చాయి. కేవలం 5.99mm మందంతో వచ్చే డిజైన్, 120Hz pOLED డిస్‌ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్, ప్రీమియం కెమెరా సెటప్, వాటర్‌ప్రూఫ్ బాడీ—ఈ మొత్తం ఫీచర్లతో ఎడ్జ్ 70 సిరీస్ మళ్లీ మోటరోలా బ్రాండ్‌ను ప్రధాన పోటీదారు సామ్సంగ్ గెలాక్సీ సిరీస్‌తో నేరుగా తలపడనుంది. వచ్చే జనవరిలో లాంచ్ కాబోయే గెలాక్సీ ఎస్26 అల్ట్రా సరసన ఎడ్జ్70 ప్రొ గట్టిగా నిలబెడుతుందనే అంచనాలు బలపడుతున్నాయి.
ఎడ్జ్ 70 గ్లోబల్ వెర్షన్‌లో ఉన్న 6.67 అంగుళాల 1.5K pOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌రేట్, 4500 నిట్స్ బ్రైట్‌నెస్—all-round మీడియా అనుభవం ఇవ్వడం ఖాయం. అదనంగా Snapdragon 7 Gen 4 చిప్‌సెట్‌తో వచ్చిన గ్లోబల్ మోడల్‌తో సమానంగా భారత వెర్షన్ కూడా రాబోతుందనే సమాచారం లభిస్తోంది. ఈ అల్ట్రా-స్లిమ్ డిజైన్ కేటగిరీలో ఇది iPhone Air, Samsung S25 Edge వంటి మోడళ్లకు ప్రత్యక్ష పోటీగా వస్తోంది. ఈసారి మోటరోలా డిజైన్‌తో పాటు ధర విషయంలో కూడా అనూహ్యమైన మలుపు దిశగా అడుగు వేసినట్లు తెలుస్తోంది.
కొత్త ఎడ్జ్ 70 / 70 ప్రో డిజైన్ – భారత మార్కెటే టార్గెట్

డిజైన్ విషయానికి వస్తే ఎడ్జ్ 70 సిరీస్ ప్రధాన USP—అల్ట్రా-స్లిమ్ బాడీ. కేవలం 5.99mm మందంతో స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోన్లలో ఒకటిగా ఉండబోతోంది. లోహపు ఫ్రేమ్, గొరిల్లా గ్లాస్ 7i రక్షణ, IP68 & IP69 రేటింగ్స్ వల్ల ధృడత్వపరంగా కూడా ఎలాంటి సందేహం ఉండదు. వెనుక భాగంలో పాంటొన్ కలర్ ఫినిష్, ప్రీమియం టెక్స్చర్‌తో ప్రత్యేక క్లాస్ ఫీలింగ్ ఇస్తుంది.
భారత మార్కెట్‌కు ప్రత్యేకంగా 50MP ట్రిపుల్ కెమెరా సెటప్, పెద్ద బ్యాటరీ, కొత్త సాఫ్ట్‌వేర్ ఫీచర్లు రానున్నాయని లీకుల ద్వారా తెలిసింది. గ్లోబల్ యూనిట్‌లో ఉన్న డ్యూయల్ 50MP కెమెరాలతో పాటు ఇండియా వెర్షన్‌లో టెలీఫోటో చేరే అవకాశం ఉంది. ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా రాబోతుందని రిపోర్టులు సూచిస్తున్నాయి, ఇది సోషల్ మీడియా క్రియేటర్లకు పెద్ద సానుకూలాంశం.
మోటరోలా గెరిల్లా దాడి – శక్తివంతమైన చిప్‌సెట్, కొత్త హలో యూఐ

అంతర్గత స్పెక్స్‌లో, ఎడ్జ్ 70 గ్లోబల్ వెర్షన్ Snapdragon 7 Gen 4తో ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో విడుదైలనప్పటికీ, Pro మోడల్ Snapdragon 8 Gen 5తో రానుందనే విషయం మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. 12GB RAM, 512GB స్టోరేజ్, 4800–5000mAh బ్యాటరీ, 68W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు లీకుల్లో కనిపిస్తున్నాయి. ఇండియా వెర్షన్‌లో బ్యాటరీ ఇంకా పెద్దదిగా రావచ్చని, మందం మాత్రం అంతే సన్నగా ఉండబోతోందని టిప్‌స్టర్‌లు సూచిస్తున్నారు.
ఆండ్రాయిడ్ 16 ఆధారంగా కొత్త Hello UI, AI-డ్రైవెన్ ఫీచర్లు, smooth animations, advanced security tools—all combinedగా ఈ ఫోన్‌ను ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అనుభవానికి దగ్గరగా తీసుకెళ్తాయి. మిలిటరీ గ్రేడ్ ధృడత్వం కూడా ఈ సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణ.
ఎడ్జ్ 70 ధర విషయంలో ఊహించని ట్విస్ట్
అత్యంత హాట్ టాపిక్ మాత్రం ధర. ఎడ్జ్ 70 గ్లోబల్ ధర ₹80,000 సమానంగా ఉన్నప్పటికీ, భారత మార్కెట్‌లో ఈ ఫోన్‌ను ₹35,000 లోపు ధరతో మోటరోలా విడుదల చేయనున్నట్లు లీకులు చెబుతున్నాయి. ఇది నిజమైతే, మార్కెట్‌ను ఎడ్జ్ 70 ఊపేయం ఖాయం. ముఖ్యంగా ప్రీమియం ఫోన్ల లుక్ & ఫీల్ , లో బడ్జెట్ వినియోగదారులకు ఇది గొప్ప ప్రత్యామ్నయంగా మారుతుంది. ఇక ఎడ్జ్ 70 ప్రొ విషయానికొస్తే ధర సుమారు 60వేల వరకు ఉండొచ్చు. అయినా కూడా సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్లతో పోలిస్తే చాలా తక్కువ.
ఎడ్జ్ 70 / 70 ప్రో India launch తేదీగా డిసెంబర్ 15వ తేదీకి అటూఇటూగా ఉండొచ్చని అంచనా. తక్కువ ధరైనా, పవర్ఫోన్ కావాలనుకునేవారికి ఇంతకుమించింది లేదు.
మోటరోలా ఎడ్జ్ 70 క్లౌడ్ డాన్సర్ ఎడిషన్ : లగ్జరీ రూపురేఖలు

మోటరోలా ఎడ్జ్ 70 క్లౌడ్ డాన్సర్ ఎడిషన్ డిసెంబర్ 5, 2025న ప్రకటించారు. ఇది మామూలు ఎడ్జ్70ను ప్రత్యేకంగా తయారుచేసిన ఆడంబరపు అవతారం. లగ్జరీ ట్విస్ట్‌గా వచ్చిన స్పెషల్ వేరియంట్. వెనుక భాగంలో క్లౌడ్ డ్యాన్సర్ తెలుపు వర్ణం(Cloud Dancer Pantone 11-42016)లో ఉన్న వీగన్ చర్మపు ఫినిష్, అలాగే ప్యానెల్‌పై అమర్చిన 14 అసలు స్వరోస్కీ(Swarovski) స్పటికాలను కలిపి ఫోన్‌కు హై-ఫ్యాషన్ లగ్జరీ ఫీల్‌ను ఇస్తాయి. అదనంగా, ఒక సిల్వర్ డిటాచబుల్ చెయిన్ కూడా ఉంది, దాని చివర 26-facet స్వరోస్కీ క్రిస్టల్ అమర్చారు—ఫోన్‌ని హ్యాండ్‌బ్యాగ్ యాక్సెసరీలా కూడా ఉపయోగించవచ్చు.
డిజైన్ మార్చినా, హార్డ్‌వేర్ మాత్రం స్టాండర్డ్ Edge 70 మాదిరిగానే ఉంది. Snapdragon 7 Gen 4 చిప్‌సెట్, 12GB LPDDR5x RAM, 512GB UFS 4.0 స్టోరేజ్—all-flagship ఉపయోగానికి సరిపడే శక్తివంతమైన కాంబినేషన్. కెమెరా సెటప్‌లో 50MP OIS మెయిన్ సెన్సార్ + 50MP అల్ట్రావైడ్, ఫ్రంట్‌లో 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. బ్యాటరీ 4800mAh సిలికాన్–కార్బన్ యూనిట్, 68W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
Android 16 ఆధారంగా Hello UI నడిచే ఈ స్పెషల్ ఎడిషన్‌కు 4 OS అప్డేట్లు + 2031 వరకూ సెక్యూరిటీ అప్డేట్లు లభిస్తాయి.
స్టాండర్డ్ Edge 70 ధర యూరప్‌లో €799 (₹81,000 సుమారు). Cloud Dancer Edition దీనికంటే ఖరీదుగా ఉండటం ఖాయం, అయితే అధికారిక ధర ఇంకా ప్రకటించలేదు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram