Indian Lullabies | అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
భారతీయ కుటుంబాలకు అనేక తరాలుగా తెలిసిన ఈ నిజంపై ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా దృష్టిసారిస్తున్నారు. నిజానికి ఈ లాలిపాటలు కేవలం నిద్రపుచ్చడానికే కాదని, శిశువు మెదడు వేగంగా అభివృద్ధి చెందటానికి, భాషా నైపుణ్యాలు, భావోద్వేగాలు, భద్రతకు దన్నుగా నిలుస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. తల్లో, తండ్రో, నానమ్మలో పాడే పాటలు.. చిన్నారి వినడమే కాదు.. ఆ పాటలతో ఒక కొత్త ప్రపంచాన్ని దర్శిస్తుంది.
Indian Lullabies | నిశ్శబ్దంగా ఉన్న రాత్రిపూట.. ఓ గదిలో మృదువైన స్వరం వినిపిస్తుంది. తన బిడ్డను తల్లి హత్తుకుని ఏదో ఒక రాగం తీస్తూ పాటపాడుతూ ఉంటే.. ఆ పసిగుడ్డు చేతులు ఆమె చేతులను తాకుతుంటాయి. అలా.. నిద్రలోకి వెళ్లిపోతుంది. నానమ్మో, అమ్మమ్మో.. ఉయ్యాలను ఊపుతూ తన బిడ్డలకు పాడిన లాలి పాటను పాడుతూ ఉంటే.. అప్పటిదాకా ఊసులు చెప్పిన శిశువు.. కమ్మటి నిద్రలోకి జారుకుంటుంది! గుక్కపట్టి ఏడుస్తున్న బిడ్డను ఎత్తుకుని తండ్రి.. వెన్ను మీద మెల్లగా తడుతూ.. నోటితో ఏవేవో శబ్దాలు చేస్తుంటే.. ఆ బిడ్డ అన్నీ మర్చిపోయి.. నవ్వేస్తుంది! ఈ దృశ్యాలు.. ఈ పాటలు.. వాటితో బోసినవ్వులు దేశంలోని ప్రతి ఇంటికీ పరిచయమే! లాలిపాట నిద్రపోయే ముందు చిన్నారులు ఆ రోజుకు వినే చివరి స్వరం! అది సాదాసీదాగా ఉండొచ్చు.. అందులో మాటలు ఆ చిన్నారికి అర్థం కాకపోవచ్చు! కానీ.. సృతి, లయ, సంస్కృతి, ప్రేమ, ఆప్యాయత, భరోసా వీటన్నింటితో కూడిన అందమైన పుష్పగుచ్ఛమే లాలి పాట!
భారతీయ కుటుంబాలకు అనేక తరాలుగా తెలిసిన ఈ నిజంపై ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా దృష్టిసారిస్తున్నారు. నిజానికి ఈ లాలిపాటలు కేవలం నిద్రపుచ్చడానికే కాదని, శిశువు మెదడు, భాషా నైపుణ్యాలు వేగంగా అభివృద్ధి చెందటానికి, భావోద్వేగాలు, భద్రతకు దన్నుగా నిలుస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. తల్లో, తండ్రో, నానమ్మలో పాడే పాటలు.. చిన్నారి వినడమే కాదు.. ఆ పాటలతో ఒక కొత్త ప్రపంచాన్ని దర్శిస్తుందని పేర్కొంటున్నారు.
సైన్స్ ఏం చెబుతున్నది?
శబ్దం, లయ, మృదువైన స్వరం.. ఈ మూడు కలిసి తల్లి నోటి నుంచి జాలువారే అమృతధార.. జోల పాట. ఈ అమృతధార.. ఒక మానసిక, శారీరక ప్రశాంతతను కల్పిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. గుండె వేగాన్ని స్థిరపర్చి, శ్వాసను సమతుల్యం చేస్తాయి. తద్వారా శిశువును ప్రశాంత స్థితికి తీసుకెళ్లి.. నిద్రపోయేందుకు సిద్ధం చేస్తాయి. నిజానికి బిడ్డకు ఆ పాటలోని పదాలు తెలియవు. కానీ.. తాను గుర్తించగల తల్లి స్వరం.. తల్లి పాడే పాట లయ.. ఆ బిడ్డకు నిద్రపోయే సమయం వచ్చిందనేందుకు సంకేతాలు. ఇది ఒక క్రమపద్ధతిలో రోజూ సాగే క్రమంలో శిశువుకు నిద్ర ప్యాట్రన్స్ ఏర్పాటు చేస్తాయి. అదే సమయంలో భాషను అర్థం చేసుకునే ప్రయత్నాలు మొదలవుతాయి. తల్లి పదే పదే పలుకుతున్న పదాలకు ఉండే లయను బిడ్డ గమనిస్తుంది. సదరు శబ్దాలకు అర్థాలేంటో తెలుస్తుంది. దా దా దా.. అంటూ ఉంటే రమ్మని పిలుస్తున్నట్టు అర్థం చేసుకుంటుంది. ఇతర పదాలూ అంతే. శబ్దాల గుర్తింపు, వినికిడి నైపుణ్యం, ఎర్లీ వొకేబులరీ, ప్రాథమిక నైపుణ్యాలను జోలపాటలు అభివృద్ధి చేస్తాయి. అదే ఇంట్లో వేర్వేరు భాషలు మాట్లాడే వాళ్లు ఉంటే.. అది బిడ్డకు మరింతగా భాషా సమన్వయం కోసం, త్వరగా వేర్వేరు భాషల పదాలు అర్థం చేసుకోవడం కోసం దోహదం చేస్తుంది. పిల్లలు పెరిగి పెద్దవాళ్లయినా ఆ పదాలు మర్చిపోయినా.. ఆ సంగీతం, ఆప్యాయతా భావన వారి గుండెల్లో నిలిచిపోతుంది. అది మనసులో ప్రేమను మరింత బలంగా నాటుతుంది. నిజానికి ఇవే వారికి ఇవ్వగలిగే మధురమైన తొలి బహుమతి!
ఇవి కూడా చదవండి..
IndiGo Crisis | విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
Heliconia | మోదీ–పుతిన్ భేటీలో అందరినీ తనవైపుకు తిప్పుకున్న మొక్క
Sand Vipers : ఎడారి పాము ఎత్తులు ఎన్నో..క్షణాల్లో ఇసుకలోకి!
Smart Phones | స్మార్ట్ ఫోన్లు డేంజర్ గురూ.. ప్రమాదంలో ప్రజల వ్యక్తిగత గోప్యత
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram