Heliconia | మోదీ–పుతిన్ భేటీలో అందరినీ తనవైపుకు తిప్పుకున్న మొక్క
మోదీ–పుతిన్ భేటీలో ఇద్దరి మధ్యలో కనబడిన ఓ మొక్క దేశవ్యాప్తంగా ఆశ్చర్యకర చర్చకు దారితీసింది. ఏంటీ మొక్క, ఎక్కడిది? ఎందుకు పెట్టారు? దాని అర్థం ఏంటి?... ఇలా చాలా సందేహాలు ప్రజలను అతలాకుతలం చేసాయి. దాని గురించిన పూర్తి వివరాలు ఇవే.
Heliconia’s Presence at Modi–Putin Meet: A Symbol of Growth and Positive Energy
మోదీ–పుతిన్ భేటీలో హెలికోనియా పూలమొక్కపై చూపు
హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల భేటీ సమయంలో ఒక చిన్న విషయం అందరి చూపునీ ఆకర్షించింది—ఇద్దరి మధ్యలో బల్లపై ఉంచిన ఓ ఆకర్షణీయమైన పూలమొక్క. ఎరుపు, పసుపు రంగుల హంగులతో మెరిసిన ఆ మొక్క పేరు హెలికోనియా.
(విధాత స్పెషల్ డెస్క్, హైదరాబాద్)
హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల భేటీ సమయంలో ఒక చిన్న విషయం అందరి చూపునీ ఆకర్షించింది—ఇద్దరి మధ్యలో బల్ల మీద ఉన్న ఒక పూలమొక్క. ఎరుపు, పసుపు రంగుల హంగులతో అందంగా మెరిసిపోయిన ఆ మొక్క పేరు హెలికోనియా.
హెలికోనియా (Heliconia)సాధారణ అలంకరణ మొక్క కాదు. దీన్ని చాలా చోట్ల సానుకూల శక్తి, శ్రేయస్సు, వృద్ధి, కొత్త ఆరంభాలకు ప్రతీకగా భావిస్తారు. దాని నిలువుగా, బలంగా ఎదిగే తీరు, ప్రకాశవంతమైన రంగులు చూసినవారికి “ఆత్మవిశ్వాసం” , “ముందుకు సాగాలి” అన్న సానుకూల దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కారణంగా, ఇది దౌత్య సమావేశాల్లో మంచి సంకేతంగా పరిగణించబడుతుంది.
హెలికోనియా –భారత్, రష్యాల స్నేహానికి మేలైన ప్రతీక
![]()
సాధారణంగా అత్యున్నత స్థాయి సమావేశాల్లో పూలు, రంగులు, బ్యాక్‌డ్రాప్ లాంటి అంశాలు యాదృచ్ఛికంగా ఉండవు. ప్రతి వస్తువూ ఒక సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటారు. అదే విధంగా జరుగబోయే సమావేశపు ప్రాధాన్యతను, దేశాలను బట్టి ఆకర్షించే మొక్కలు, పూలు, పెయింటింగులు, కుర్చీలు, బల్లలు.. ఇలా అన్నింటినీ చాలా జాగ్రత్తగా ఎంచుకుంటారు. చాలామంది మొదట ఇది కేవలం ఒక అలంకార మొక్క అనుకున్నారు. అయితే హెలికోనియాకు ఉన్న ప్రతీకాత్మక అర్థాలు తెలుసుకున్న తరువాత, దీనిని సమావేశంలో ఉంచడం యాదృచ్ఛికం కాదని అనిపించింది. ప్రస్తుతం జరుగుతున్నది చిరకాల మిత్రుల సమావేశం కాబట్టి భారత్–రష్యా మధ్య ఉన్న సానుకూల సంబంధాలు, కొనసాగుతున్న సహకారం, భవిష్యత్తు పురోగతికి సూచనగా హెలికోనియా పెట్టి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
హెలికోనియా భారతదేశపు మొక్క కాదు. ఇది ప్రధానంగా దక్షిణ అమెరికా, సెంట్రల్ అమెరికా ఉష్ణ ప్రాంతాల్లో పెరుగుతుంది. అయినా దాని ఆకర్షణీయమైన రూపం వల్ల హోటళ్లు, అధికార సమావేశాలు, ముఖ్య వేదికల్లో తరచూ వాడతారు. మన వద్ద నాటినా పెరగదు కూడా. మొత్తం మీద, మోదీ–పుతిన్ సమావేశం రాజకీయంగా ఎంత ముఖ్యమో, ఆ మొక్క ఇచ్చిన మౌన సందేశం కూడా అంతే ఆసక్తికరంగా మారింది. ఈ భేటీ సానుకూల దిశలో సాగుతోందన్న భావనను హెలికోనియా శాంతంగా, అందంగా అందించింది.
హెలికోనియా ప్రత్యేకతలు ఏమిటి?
హెలికోనియా (Heliconia) అనేది ప్రధానంగా సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా మరియు పసిఫిక్ ప్రాంతాలకు చెందిన ట్రాపికల్ పుష్ప మొక్క. దీని ప్రత్యేకతలు ఇలా ఉంటాయి:
- ప్రకాశించే ఎరుపు,నారింజ, పసుపు రంగులతో చూపరులను ఇట్టే ఆకట్టుకునే పువ్వు
- ‘లాబ్స్టర్ క్లా(lobster claw)’, ‘ఫాల్స్ బర్డ్ ఆఫ్ ప్యారడైజ్(false bird of paradise)’ వంటి పేర్లతో ప్రసిద్ధి
- తెడ్డు ఆకారంలో పైకెగసే ఆకృతి, ఇది ఎదుగుదలకు చిహ్నంగా భావించబడుతుంది
- వేడి, తేమ ఉన్న వాతావరణాల్లో బాగా పెరుగుతుంది
- హోటళ్లు, ప్రధాన వేదికలు, ఇంటీరియర్ డిజైన్‌లో తరచుగా వాడే మొక్క
దాని నిలువుగా, బలంగా ఎదిగే రూపం, ఆత్మవిశ్వాసం మరియు బలమైన భాగస్వామ్యాలకు ప్రతీకగా కూడా చెప్పబడుతుంది. ఈ లక్షణాలు మోదీ–పుతిన్ భేటీకి సహజంగానే సరిపోతాయి.
హెలికోనియాను ఎందుకు అక్కడ ఉంచారో అర్థమవుతుందా?
![]()
అత్యున్నత స్థాయి సమావేశాలలో చిన్న అంశమూ ప్రాధాన్యం సంతరించుకుంటుంది. కాబట్టి హెలికోనియా ని మోదీ–పుతిన్ మధ్యలో ఉంచడం ఒక మౌన దౌత్య సంకేతంగానే చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు.
- ఈ సమావేశం సాకుకూల దృక్పథంతో సాగుతోంది అన్న ఫీలింగ్
- రెండు దేశాల మధ్య పురోగతి ముఖ్యం అనే సందేశం
- సంబంధాలు స్థిరంగా, సానుకూల దిశలో ఉన్నాయి అనే సూచన.
గది అంతా మామూలుగా ఉన్నప్పటికీ, ఈ మొక్క వాతావరణానికి హుందాతనం, స్నేహాన్ని జోడించింది చాలా దేశాలు తమ సమావేశాల్లో పూల ద్వారా సందేశాలు ఇస్తాయి. భారత్ కూడా ఇదే పద్ధతిని కొన్ని సందర్భాల్లో అనుసరిస్తుంది. మోదీ–పుతిన్ భేటీ ప్రధానంగా వ్యూహాత్మక అంశాలపైనే సాగినా, అక్కడ ఉంచిన హెలికోనియా మొక్క ఈ భేటీకి ఒక సానుకూల సందేశాన్ని ఇచ్చింది. ఇది ఒక సాధారణ పుష్పాలంకరణ కాదు — మన చిరకాల స్నేహం శాశ్వతం అన్నభావనను, ఇలాగే ముందుకు సాగుతాం అన్న విశ్వాసాన్ని ఒక సున్నితమైన సందేశంగా ఈ మొక్క అందంగా అందించింది.
కొన్నిసార్లు ఒక మొక్కలు కూడా మాట్లాడతాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram