Horoscope | బుధవారం రాశిఫలాలు.. ఈ రాశివారికి జీవిత భాగస్వామితో ఘర్షణలు..!
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. పెద్దల సలహాలు మేలు చేస్తాయి. వ్యాపారంలో లాభాలు అంతంతమాత్రంగానే ఉంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో విజయం అంత సులభంగా లభించదు. పనిభారంతో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవద్దు. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి కాబట్టి వాయిదా వేస్తే మంచిది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో శుభవార్తలు వింటారు. వృత్తి పరంగా అభివృద్ధి బాటలో పయనిస్తారు. ఆర్థికంగా శుభయోగాలున్నాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లాభాలు, ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు పదోన్నతులు ఉండవచ్చు.
సింహం (Leo)
అన్ని రంగాల వారికి కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొని సంతోషంగా గడుపుతారు. ఒక వార్త విచారం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్య (Virgo)
కన్యా రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. కాలం అనుకూలంగా లేదు కాబట్టి అన్ని విషయాల్లో ఆచి తూచి నడుచుకోవాలి. చేపట్టిన పనుల్లో తరచుగా సమస్యలు ఉండవచ్చు. జీవిత భాగస్వామితో వాదనలు, ఘర్షణలకు అవకాశం ఉంది. ఆదాయాన్ని మించిన ఖర్చులుంటాయి.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. శుభసమయం నడుస్తోంది. అన్ని రంగాల వారికి అంచనాలకు మించిన శుభ ఫలితాలు ఉంటాయి. సోదరవర్గంతో సామరస్యత పెరుగుతుంది. ఆర్థికంగా శుభ ఫలితాలున్నాయి.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కీలక వ్యవహారాల్లో నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారులు భాగస్వాములతో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే మేలు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. అన్ని రంగాల వారికి తమ తమ రంగాలలో ఆశించిన ఫలితాలు సొంతమవుతాయి. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గిట్టనివారితో జాగ్రత్తగా ఉండండి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తిలో సానుకూల ఫలితాలు ఉంటాయి. విశేషమైన ధనలాభాలకు అవకాశముంది. మీ ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. అవివాహితులకు వివాహ సూచన ఉంది. కోర్టు వ్యవహారాల్లో శ్రద్ద వహించండి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక పని పూర్తవుతుంది. లక్ష్యసాధన కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు మిత్రుల రాకతో ఇంట్లో సందడి నెలకొంటుంది.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఇతరుల సహకారంతో అన్ని పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభాలు అందుకుంటారు. బుద్ధిబలంతో కీలక సమస్యలు పరిష్కరిస్తారు. ఉద్యోగులు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. మీ పనితీరుకు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు.