Horoscope | గురువారం రాశిఫలాలు.. ఈ రాశి అవివాహితులకు కల్యాణ యోగం..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సామాన్య ఫలితాలు ఉంటాయి. పురోగతి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తే ప్రయోజనం ఉండవచ్చు. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు అధిగమించినప్పటికీ ఫలితాలు మాత్రం ఆలస్యం కావచ్చు. కీలక వ్యవహారాల్లో, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త వహించాలి. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటే మంచిది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలమైన రోజు. అన్ని రంగాల వారికి కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. స్థిరమైన నిర్ణయాలతో ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయం పెరుగుతుంది. కుటుంబ పరమైన శుభవార్తలు వింటారు. శుభకార్యాల్లో బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోబలంతో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరిగినప్పటికీ ఉత్తమ ఫలితాలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. కొందరి ప్రవర్తన మనస్థాపం కలిగిస్తుంది.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా మెలగాలి. పెద్దలతో మాట్లాడేటప్పుడు కోపావేశాలు అదుపులో ఉంచుకోవడం మంచిది. ఎవరితోనూ అనవసరమైన వాదనల్లోకి దిగవద్దు. వ్యాపారంలో ధనయోగం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరుగుతాయి. కుదిరితే ప్రయాణం వాయిదా వేయండి. కుటుంబంలో అభిప్రాయభేదాలు రాకుండా చూసుకోండి.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చక్కని ప్రణాళికతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. అవసరానికి బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలకు దిగవద్దు. ఆస్తి వ్యవహారాల్లో ఆచి తూచి అడుగేయాలి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ముఖ్యమైన పనుల్లో విజయసిద్ధి ఉంటుంది. సమయపాలనతో, స్థిరమైన నిర్ణయాలతో ఉద్యోగంలో బ్రహ్మాండమైన ఫలితాలు లభిస్తాయి. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ప్రియమైన వారితో విహారయాత్రలకు వెళ్తారు.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అదృష్ట కాలం కొనసాగుతోంది. ఎటు చూసినా విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. అధికారుల నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ధనసంపదలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూల పరిణామాలు ఆనందం కలిగిస్తాయి. మనోబలంతో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్వయంకృషితో ఉద్యోగంలో స్థిరత్వం సాధిస్తారు. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ప్రయాణాలు ఆనందదాయకంగా ఉంటాయి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ లాభాలు ఆశించిన మేరకు ఉంటాయి. స్పష్టమైన ఆలోచన విధానంతో ముందుకు సాగితే కార్యసిద్ధి ఉంటుంది. కుటుంబంలో కలహాలు రాకుండా జాగ్రత్త వహించండి. ప్రయాణాలలో ప్రమాదాలు ఉండవచ్చు కాబట్టి అప్రమత్తంగా ఉండండి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. శుభకార్యాల్లో సన్నిహితులు, స్నేహితులు, ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు. అవివాహితులకు కళ్యాణయోగం ఉంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని మీకు అనుకూలంగా జరుగుతాయి. వృత్తిపరంగా కూడా చక్కగా రాణిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు అందుకోవడం ఉత్సాహాన్నిస్తుంది. ఒక శుభవార్త వింటారు. కీలక విషయాల్లో బుద్ధిబలం చక్కగా పనిచేస్తుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో సహచరుల తోడ్పాటు ఉంటుంది. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో నిర్లక్ష్యం ప్రమాదకరం కావచ్చు. నిరంతర కృషితో ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగు పడుతుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram