Tata Sierra Electric SUV : ‘టాటా సియెర్రా’ బుకింగ్స్ రికార్డు..ఒక్క రోజే 70వేలకుపైగానే!
ఐకానిక్ బ్రాండ్ 'టాటా సియెర్రా' సరికొత్త రికార్డు సృష్టించింది. బుకింగ్స్ ప్రారంభమైన 24 గంటల్లోనే 70 వేల ఆర్డర్లు రాగా లీటరుకు 29.9 కిమీ మైలేజీతో మార్కెట్‌ను ఆకట్టుకుంటోంది.
విధాత : టాటా మోటార్స్ కంపెనీ ఐకానిక్ బ్రాండ్ ‘టాటా సియెర్రా’ రీరిలీజ్ లో సరికొత్త రికార్డ్సుతో దూసుకపోతుంది. 90వ దశకంలో క్రేజీ కారుగా గుర్తింపు పొందిన టాటా సియోర్రా ఇప్పుడు సరికొత్త డిజైన్స్, ఆధునిక ఫీచర్లతో మళ్లీ వినియోగదారులకు అందుబాటులో వచ్చింది. టాటా సియెర్రా న్యూ వర్షన్ కారు బుకింగ్స్ ప్రారంభమైన తొలి రోజునే 24గంటల్లోనే 70వేల కంటే ఎక్కువ బుకింగ్స్ ను నమోదు చేసి..ఆటోమొబైల్ మార్కెట్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పింది. మరో 1.35 లక్షల మంది కస్టమర్లు తమకు నచ్చిన వేరియంట్, కాన్ఫిగరేషన్‌ను ఎంపిక చేసుకుని బుకింగ్ ప్రక్రియను పూర్తి చేసే దశలో ఉన్నారని కంపెనీ వెల్లడించింది.
ఒకప్పుడు భారతీయ రోడ్లను శాసించిన సియెర్రా.. ఇప్పుడు పాత వింటేజ్ లుక్ తో పాటు ఆధునిక సాంకేతికత ఫీచర్స్ తో కలిపి తీసుకురావడమే ఈ భారీ బుకింగ్స్‌కు ప్రధాన కారణంగా ఆటో నిపుణులు చెబుతున్నారు. పాత సియెర్రా సిగ్నేచర్ స్టైల్ అయిన ‘కర్వ్డ్ రియర్ గ్లాస్’ విండోను కొత్త సియెర్రాలోనూ టాటా మోటార్స్ కొనసాగించనుంది. టాటా సియెర్రా బాక్సీ డిజైన్ కార్ లవర్స్‌ను ఆకట్టుకుంది.
ప్రస్తుతం ప్రీమీయం విభాగంలో టాటా మోటార్స్ ఇప్పటికే అగ్రగామిగా ఉంది. నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీల తర్వాత.. సియెర్రా ఈవీతో ప్రీమియం ఎస్ యూవీ సెగ్మెంట్‌ను కూడా తన హస్తగతం చేసుకోవాలని టాటా ప్లాన్ చేస్తోంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో వినియోగదారుల్ని ఆకర్షించింది. సియెర్రా పెట్రోల్, డిజిల్ వేరియంట్లను కలిగి ఉంది. ఈ కారు మార్కెట్లోని మహీంద్రా, హ్యుందాయ్‌లకు గట్టి పోటీ ఇవ్వనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్రోల్ వేరియంట్‌లో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (160 hp , 255 Nm) 6-స్పీడ్ ఆటోమేటిక్‌తో అందుబాటులో ఉంది. న్యాచురల్లి ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (106 hp, 145 Nm ) మాన్యువల్, డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో వస్తుంది. డీజిల్ వేరియంట్‌లో 1.5 లీటర్ ఇంజిన్ (118 hp) మాన్యువల్, ఆటోమేటిక్ ఆప్షన్లతో లభిస్తుంది. దీంట్లో 6-స్పీడ్ మాన్యువల్ 260 Nm టార్క్, 6-స్పీడ్ ఆటోమేటిక్ 280 Nm టార్క్‌ను కలిగి ఉంటుంది. టాటా సియెర్రా బాక్సీ డిజైన్ కార్ లవర్స్‌ను ఆకట్టుకుంది. భద్రతకు సంబంధించి టాటా సియెర్రా మంచి రేటింగ్ పొందడంతో పాటు పెట్రోల్ వెర్షన్ 1.5-లీటర్ హైపెరియన్ పెట్రోల్ ఇంజిన్ కారు లీటరుకు 29.9 కిలోమీటర్లు మైలేజ్ తో రికార్డు సాధించింది.
ఇవి కూడా చదవండి :
Australia vs England : యాషెస్ సిరీస్ మూడో టెస్టులో కెరీ సెంచరీ
KCR : బీఆర్ఎస్ ఎల్పీ కీలక భేటీ 21న..హాజరుకానున్న కేసీఆర్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram