Tata Motors : సంక్రాంతి పందెం కోళ్లు.. టాటా కార్లు…సియోరా..పంచ్ ఫేస్ లిఫ్ట్ ల దూకుడు

సంక్రాంతి పండుగ వేళ టాటా మోటార్స్ దూకుడు పెంచింది. సియోరా లాంచ్‌తో పాటు పంచ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల చేసి కార్ల మార్కెట్‌లో సంచలనం సృష్టించింది.

Tata Motors : సంక్రాంతి పందెం కోళ్లు.. టాటా కార్లు…సియోరా..పంచ్ ఫేస్ లిఫ్ట్ ల దూకుడు

విధాత: సంక్రాంతి పండుగ సందర్భంగా దేశీయ ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన కార్ల లవర్స్ ను ఆకట్టుకోవడంలో పందెం కోళ్లను మరిపించేరీతిలో దూసుకుపోతుంది. ఓ వైపు టాటా ఐకానిక్ క్లాసిక్ ప్రొడక్ట్ టాటా సియోరా డెలివరీలను జనవరి 15నుంచి ప్రారంభించేందుకు సిద్దమైంది. ఇందుకోసం సియెరా స్మార్ట్ ప్లస్ వేరియంట్ 1.5 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ సహా అన్ని వేరియంట్లను టాటా షోరూమ్ లలో డెలివరీకి సిద్దం చేసింది. టాటా సియోరా లాంచ్ చేసిన 24గంటల్లోనే 70వేల బుకింగ్ లు పొందడంతో పాటు..మరో 2.50లక్షల మంది పేర్లు నమోదు చేసుకోవడంతో కార్ల విక్రయాల రంగంలో కొత్త రికార్డు సృష్టించింది.

టాటా సియోరా ప్రారంభ ఎక్స్ షో రూమ్ ధర రూ.11.49లక్షలుగా ఉంది. ఈ కొత్త కారు స్మార్ట్ ప్లస్, ప్యూర్, ప్యూర్ ప్లస్, అడ్వెంచర్, అడ్వెంచర్ ప్లస్, అకంప్లిష్డ్ ప్లస్ వేరియంట్లను పంపిణీ కోసం రంగంలోకి దించేసింది. సియోరా బేస్ మోడల్ రూ.11.49లక్షలు అయితే..1.5లీటర్ క్రయోజెట్ డీజిల్ ఇంజిన్ తో లభించే బేస్ వేరియంట్ మోడల్ ఎక్స్ షో రూమ్ ధర రూ.12.99లక్షలుగా. టాప్ మోడల్ అడ్వెంచర్ ప్లస్ 18.49లక్షల వరకు ఉంది.

టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ జోరు

టాటా మోటార్స్ ప్యాసింజర్స్ వెహికల్స్ టాటా పంచ్ ఫేస్ లిఫ్టును జనవరి 13న దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూం ధర 5.59 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మంగళవారం నుంచే పంచ్ ఫేస్ లిఫ్ట్ ప్రారంభిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. టాటా సియోరా మోడల్స్ కలర్ డిజైన్స్ ను, పంచ్ ఈవీ మోడల్ ను తలపించేలా.. ఆధునీకరించిన పంచ్ ఫేస్ లిఫ్ట్ కార్ల ప్రియులను ఆకర్షించేదిగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పంచ్ ఫేస్ లిఫ్ట్ చిత్రాలు, వీడియోలను నెటిజన్లు తెగ చూస్తున్నారు. కొత్త మోడల్ లో డిజైన్, టెక్నాలాజీ, భద్రత పరంగా కంపెనీ గణనీయమైన మార్పులు చేసింది. కొత్తగా వచ్చిన సియోరా డిజైన్స్.. సైంటిఫిక్ కారా మిల్, బెంగాల్ రూజ్, కూర్గ్ క్లౌడ్స్ వంటి కలర్ ఆప్షన్ తో ఇప్పుడు పంచ్ ఫేస్ లిఫ్ట్ కూడా కస్టమర్లకు లభించనుంది. ఇంటీరియల్ పరంగాను పలుమార్పులు చేశారు. ఇందులో 10.25 టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్, 360డిగ్రీల కెమెరా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త పంచ్ ఫేస్‌లిఫ్ట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా అందిస్తోంది. టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ 1.2 లీటర్ రేవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్, సీఎన్జీ వంటి ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. మొత్తం ఆరు వేరియంట్ లలో అందుబాటులో ఉంది.

పంచ్ ఫేస్ లిఫ్ట్ మెక్రో ఎస్వీయూ సెగ్మెంట్ లో హుండాయ్ ఎక్స్ టర్న్, నిస్సాన్ మాగ్నైట్, మహింద్రా 3ఎక్స్ యూ, మారుతి సుజుకీ ఇగ్నిస్ వంటి కార్లతో ఇది పోటీ పడనుంది. కొత్త పంచ్ లో ఎల్ఈడీ హెడ్ లాంప్స్ ను రీడిజైన్ చేశారు .రీడిజైన్ చేసిన స్పోర్టీవ్ బంపర్స్ , కొత్త ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ , ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ , రేయిన్ సెన్సింగ్ వైపర్స్ ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. 26.03సెంటీమీటర్ల టచ్ స్క్రీనింగ్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్, 17.8సెంటిమీటర్ల డిజిటల్ క్లస్టర్ ఆకట్టుకుంటాయి. ఇప్పటికే గ్లోబల్ NCAP నుంచి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన ఈ మైక్రో ఎస్‌యూవీ.. ఫామిలీ కొనుగోలు దారులకు మరింత భరోసా కల్పిస్తోంది.

2021 అక్టోబర్ 14న గ్లోబల్ NCAP రేటింగ్ పొందిన పంచ్.. భద్రతలో బెంచ్‌మార్క్‌గా నిలిచింది.
ఇప్పటివరకు భారత మార్కెట్లో 6 లక్షలకుపైగా టాటా పంచ్ యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతేకాదు 2024లో భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కారుగా కూడా రికార్డు సృష్టించింది. ఆధునికరించిన 2026 టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ రూ.5.59 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతుంది. టాప్ ఎండ్ Accomplished+ S పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.8.99 లక్షలు. ఇక CNG మాన్యువల్ వేరియంట్ ధరలు రూ.6.69 లక్షలు నుంచి రూ.9.29 లక్షల వరకు ఉన్నాయి (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). వాయిస్-అసిస్టెడ్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు వంటి ఫీచర్స్ టాప్ వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి :

MSG Tickets | బుక్ మై షోలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ .. రెండు రోజుల్లోనే మిలియన్ టికెట్లు..
Gig Workers : భారత్ గిగ్ వర్కర్లకు ఊరట