Telangana Gram Panchayat Funds : గ్రామ పంచాయతీలకు తీపి కబురు.. రూ.277 కోట్లు విడుదల చేసిన ఆర్ధిక శాఖ
గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి తీపి కబురు! కొత్త సర్పంచ్‌ల కోసం ₹277 కోట్ల నిధులు విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక నిర్ణయం తీసుకున్నారు.
సంక్రాంతి పండుగ రోజు గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ రూ. 277 కోట్ల నిధుల విడుదలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆర్ధిక శాఖ అధికారులు సోమవారం పంచాయతీలకు రూ.277 కోట్ల నిధులను వెంటనే విడుదల చేశారు.
సోమవారం ప్రజాభవన్ లో ఆర్థిక శాఖ అధికారుల ముఖ్యసమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయితీ సర్పంచ్ లకు, వార్డు మెంబర్లకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సంక్రాతి శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Greenland Annexation Bill : గ్రీన్‌లాండ్ స్వాధీనం కోసం అమెరికాలో బిల్లు.. ఈ ద్వీపంపై ట్రంప్ ఎందుకు కన్నేశారు..?
Love Insurance : బాయ్‌ఫ్రెండ్ కోసం లవ్ ఇన్సూరెన్స్.. జాక్‌పాట్ కొట్టిన మహిళ
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram