Love Insurance : బాయ్‌ఫ్రెండ్ కోసం లవ్ ఇన్సూరెన్స్.. జాక్‌పాట్ కొట్టిన మహిళ
బాయ్‌ఫ్రెండ్‌పై నమ్మకంతో రూ.2,300 బీమా కడితే.. పెళ్లి తర్వాత రూ.1.15 లక్షల క్లెయిమ్ వచ్చింది! చైనాలో ఓ మహిళ తన 10 ఏళ్ల ప్రేమకు 'లవ్ ఇన్సూరెన్స్' ద్వారా సంపాదించిన నగదు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్.
ఆరోగ్య బీమా, జీవిత బీమా.. వంటివి విన్నాం. అయితే, ప్రేమకు కూడా బీమా ఉంటుందన్న విషయం మీలోఎంతమందికి తెలుసు..? అవునండీ.. మీరు విన్నది నిజమే. లవ్ ఇన్సూరెన్స్ (Love Insurance) ద్వారా ఓమహిళ జాక్‌పాట్ కొట్టింది. ఈ ఆసక్తికర ఘటన చైనా (China)లో చోటు చేసుకుంది.
సెంట్రల్ చైనాలోని షాంగ్జీ ప్రావిన్సు (Shaanxi province)కు చెందిన వూ, వాంగ్‌లు ఒకే యూనివర్సిటీలో చదువుకున్నారు. వీరిద్దరికీ 2015లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారితీయడంతో ఇద్దరూ డేటింగ్‌కు వెళ్లారు. బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్‌లో ఉన్న సమయంలో వూ ‘లవ్ బీమా’ తీసుకుంది. 2016లో ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌కు గిఫ్ట్‌గా 199 యువాన్‌లు (28 డాలర్లు) పెట్టి లవ్ ఇన్సూరెన్స్ తీసుకుంది. పదేళ్ల డేటింగ్ తర్వాత ఆమె తన బాయ్‌ఫ్రెండ్ వాంగ్‌ను వివాహం చేసుకుంది. 2025లో మ్యారేజ్ రిజిస్టర్ చేసుకున్నారు. ఇక వివాహం తర్వాత పదేండ్ల కిందట ఆమె కట్టిన లవ్ బీమాను విత్‌డ్రా చేసుకుంది. అప్పుడు ఆమె ఎంత బీమా పొందింతో తెలిస్తే షాక్ అవుతారు. లవ్ పాలసీతో ఆమె ఏకంగా పదివేల యువాన్‌లను
పొందింది. అంటే 1,400 డాలర్లన్నమాట.
చైనా లైఫ్ ప్రాపర్టీ (China Life Property) ఇన్సూరెన్స్ కంపెనీ డిస్కౌంట్‌లో భాగంగా చాలా తక్కువ ధరకే లవ్ బీమా ఇచ్చింది. కంపెనీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. లవ్ ఇన్సూరెన్స్ కట్టిన జంట తమ పాలసీని మూడేండ్ల తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు. అయితే, పదేండ్ల తర్వాత బీమాను క్లెయిమ్ చేసుకునే వీలుంటుంది. ఆ సమయంలో ఆ జంటకు పదివేల గులాబీ పువ్వులు లేదా 0.5 క్యారెట్ల డైమండ్ రింగ్ ఇస్తారు. ఈ రెండూ వద్దు అనుకుంటే పదివేల యువాన్ల నగదు ఇస్తారు. కానీ ఈ లవ్ ఇన్సూరెన్స్ పాలసీని 2017లోనే ఆపేశారు. ప్రస్తుతం అందుబాటులో లేదు. దీంతో స్థానికంగా ఈ లవ్ ఇన్సూరెన్స్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో దీనిపైనే తెగ చర్చ నడుస్తోంది మరి.
ఇవి కూడా చదవండి :
Tata Motors : సంక్రాంతి పందెం కోళ్లు.. టాటా కార్లు…సియోరా..పంచ్ ఫేస్ లిఫ్ట్ ల దూకుడు
MSG Tickets | బుక్ మై షోలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ .. రెండు రోజుల్లోనే మిలియన్ టికెట్లు..
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram