Australia vs England : యాషెస్ సిరీస్ మూడో టెస్టులో కెరీ సెంచరీ
యాషెస్ మూడో టెస్టులో అలెక్స్ కెరీ (106) సెంచరీతో ఆసీస్ తొలిరోజు 326 పరుగులు చేసింది. మరోవైపు, టాటా సియెర్రా EV బుకింగ్స్ మొదలైన 24 గంటల్లోనే 70 వేల మార్కును దాటి రికార్డు సృష్టించింది.
విధాత : యాషెస్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కెరీ సెంచరీ(106; 143 బంతుల్లో, 8 ఫోర్లు, 1 సిక్స్) తో రాణించడంతో తొలి రోజు ఆసీస్ జట్టు 83 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ తొలుత ఒడిదుడుకులతో సాగింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (10), జేక్ వెదర్లాడ్ (18), లబుషేన్ (19), కామెరూన్ గ్రీన్ (0), పాట్ కమిన్స్ (13) బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. జోస్ ఇంగ్లిష్ (32) పరుగులు చేయగా..స్టీవ్‌స్మిత్ స్థానంలో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ఉస్మాన్ ఖవాజా (82; 126 బంతుల్లో, 10 ఫోర్లు) రాణించాడు.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి మిచెల్ స్టార్క్ (33), నాథన్ లైయన్(0) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3, బ్రైడన్ కార్స్, విల్‌జాక్స్ తలో రెండు, జోష్ టంగ్ ఒక వికెట్ తీసుకున్నారు. అయిదు టెస్ట్‌ల ఈ యాషెస్ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆస్ట్రేలియా జట్టు 2-0తో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే.
టాటా మోటార్స్ ఐకానిక్ బ్రాండ్ ‘టాటా సియెర్రా'(Tata Sierra) సరికొత్త రూపంలో మళ్లీ భారత రోడ్లపైకి రావడానికి సిద్ధమైంది. అయితే ఈసారి ఎలక్ట్రిక్ వెర్షన్‌లో వస్తున్న ఈ కారు బుకింగ్స్ మొదలైన మొదటి రోజే సంచలనం సృష్టించింది. కేవలం 24 గంటల్లోనే 70వేల కంటే ఎక్కువ బుకింగ్స్ నమోదు చేసి.. ఆటోమొబైల్ మార్కెట్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పింది.
ఇవి కూడా చదవండి :
KCR : బీఆర్ఎస్ ఎల్పీ కీలక భేటీ 21న..హాజరుకానున్న కేసీఆర్
Diamond Rain | అక్కడ వజ్రాల వానలు! తెచ్చుకోవడం సాధ్యమేనా?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram