Horoscope | శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి శత్రు భ‌యం పొంచి ఉంది.. జ‌ర జాగ్ర‌త్త‌..!

Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope | శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి శత్రు భ‌యం పొంచి ఉంది.. జ‌ర జాగ్ర‌త్త‌..!

మేషం (Aries)

మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహసంచారం అంత అనుకూలంగా లేనందున చేపట్టిన పనుల్లో దూకుడు తగ్గించుకోవాలి. కొత్త ప్రాజెక్టులు, వ్యాపారాలకు ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.

వృషభం (Taurus)

వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. కొన్ని సంఘటనల కారణంగా మనోవేదనతో ఉంటారు. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. ఆదాయం ఆశించిన మేరకు ఉండకపోవచ్చు. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. ప్రయాణాలు ప్రమాదకరంగా పరిణమిస్తాయి కాబట్టి వాయిదా వేయండి.

మిథునం (Gemini)

మిథునరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం, ఏ రంగమైనా గొప్పగా ఉంటుంది. వ్యాపారంలో పట్టింది బంగారం అవుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు వృద్ధి అవుతాయి.

కర్కాటకం (Cancer)

కర్కాటకరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అదృష్ట సమయం. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులు అనూహ్యమైన లాభాలు పొందుతారు.

సింహం (Leo)

సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సన్నిహితుల సహకారంతో అన్ని పనులు విజయవంతమవుతాయి. లక్ష్యసాధనలో విజయం సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో చిన్న చిన్న ఇబ్బందులున్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు.

కన్య (Virgo)

కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా బుద్ధిబలంతో అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ఆర్ధిక నష్టం సూచన ఉంది.

తుల (Libra)

తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో ఆశించిన ఫలితాలు ఉండడంతో ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో విందు వినోదాలలో పాల్గొని సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఆ

వృశ్చికం (Scorpio)

వృశ్చికరాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు. లక్ష్మీకటాక్షంతో ఐశ్వర్యవంతులు అవుతారు. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఒక శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. కుటుంబ వాతావరణం ఆనందోత్సాహాలతో ఉంటుంది.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనులు సజావుగా సాగాలంటే శ్రద్ధ, ఏకాగ్రత అవసరం. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కుటుంబ సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులు రాకుండా ముందుచూపుతో వ్యవహరించాలి.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ రోజు శుభప్రదమైన రోజు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. కొన్ని శుభవార్తలు భవిష్యత్ పట్ల ఆశలు కలుగజేస్తాయి. వ్యాపారంలో పురోగతి, ఆర్ధిక వృద్ధి ఉంటాయి. మీ ప్రతిభతో ఉద్యోగంలో మంచి గుర్తింపు సాధిస్తారు.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తిలో, ఆర్ధిక వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో పట్టుదలతో ముందుకు సాగితే సత్ఫలితాలు ఉంటాయి. ఇతరుల విషయంలో జోక్యం తగ్గించుకోండి. ప్రతికూల ఆలోచనలు, వివాదాలకు దూరంగా ఉండండి.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. డబ్బు అధికంగా ఖర్చవుతుంది. శుభవార్తలు అంతవిశ్వాసాన్ని పెంచుతాయి. కుటుంబంలో శాంతి నెలకొల్పడానికి కోపావేశాలు అదుపులో ఉంచుకోండి. ఉద్యోగ వ్యాపారాలలో ఆదాయం నిరాశ కలిగించవచ్చు.