Mokshagna | మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయిన‌ట్టేనా.. డైరెక్ట‌ర్ మ‌రెవ‌రో కాదు..!

Mokshagna | చాలా కాలంగా నందమూరి అభిమానులు అత్యంత ఆసక్తిగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా ఈ యంగ్ హీరో డెబ్యూ గురించి అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి.

  • By: sn |    movies |    Published on : Dec 12, 2025 11:47 AM IST
Mokshagna | మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయిన‌ట్టేనా.. డైరెక్ట‌ర్ మ‌రెవ‌రో కాదు..!

Mokshagna | చాలా కాలంగా నందమూరి అభిమానులు అత్యంత ఆసక్తిగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా ఈ యంగ్ హీరో డెబ్యూ గురించి అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి. ఈ ఏడాది ఏదో ఒక రూపంలో మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం ఖాయం అవుతుందని అభిమానులు నమ్మినా, అనుకోని కారణాలతో ప్రాజెక్ట్‌లు ఆగిపోవడం వారి నిరాశను మరింత పెంచింది.

ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ నిలిచిపోవడంతో నిరాశ

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అనౌన్స్ అయినా, అది షూటింగ్ దశకు చేరుకోక ముందే ఆగిపోయింది. అయితే ఈ సమయంలో మోక్షజ్ఞ విడుదల చేసిన న్యూ లుక్స్ మాత్రం అభిమానుల్లో కొత్త జోష్‌ నింపాయి. పూర్తిగా మారిన లుక్‌తో కొత్త ఎనర్జీని చూపిస్తూ, ప్రేక్షకులకు అదిరే ట్రీట్ ఇచ్చాడు.

2026 న్యూ ఇయర్‌కు క్లియర్ ప్లాన్?

తాజా సమాచారం ప్రకారం, బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞ కోసం కొత్త ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. 2026 న్యూ ఇయర్ సందర్భంగా మోక్షజ్ఞ కొత్త సినిమా ప్రారంభించే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని, అదే సంవత్సరం చివరికల్లా చిత్రాన్ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడి విషయమై కూడా ఇప్పటికే ఒకరిని ఫైనల్ చేసినట్టు సమాచారం.

మోక్షజ్ఞ డెబ్యూ… బోయపాటి శ్రీను చేతుల మీదుగా?

టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మరో హాట్ వార్త .. మోక్షజ్ఞ తొలి సినిమాను బోయపాటి శ్రీను డైరెక్టర్‌గా తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయట. బాలకృష్ణ కెరీర్‌లో వరుస బ్లాక్‌బస్టర్స్ అందించిన బోయపాటి, మోక్షజ్ఞను కూడా భారీ స్థాయిలో లాంచ్ చేయాలని బాలయ్య భావిస్తున్నారనే టాక్ జోరుగా ఉంది. మోక్షజ్ఞ కోసం బోయపాటి ఒక పవర్‌ఫుల్ లవ్ స్టోరీ + ఎమోషనల్ యాక్షన్ డ్రామా లైన్ సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. అయితే ఈ సమాచారం ఇప్పటివరకు అధికారికంగా బయటకు రాలేదు.

బాలకృష్ణ డైరెక్షన్‌లో ‘ఆదిత్య 369’ సీక్వెల్?

చాలా కాలంగా బాలకృష్ణ దర్శకత్వంలో ఆదిత్య 369 సీక్వెల్ రూపుదిద్దుకుంటుందని, అందులో మోక్షజ్ఞ హీరోగా కనిపిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.బాలయ్య కూడా పలు సందర్భాల్లో సీక్వెల్ మాత్రం ఖాయం అని చెప్పినప్పటికీ, మోక్షజ్ఞ అందులో నటిస్తారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు.

ప్రస్తుతం బాలకృష్ణ ఫోకస్ — ‘అఖండ 2’

ఇప్పటికైతే బాలకృష్ణ మొత్తం దృష్టి అఖండ 2 మీదే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమా నిర్మాతకు సంబంధించిన ఫైనాన్షియల్ సమస్యల కారణంగా వాయిదా పడింది. తరువాత మళ్లీ రిలీజ్ డేట్ ప్రకటించగా, ఈసారి తెలంగాణాలో లీగల్ సమస్యలు ఎదుర్కోక తప్పలేదు. అయినా చివరకు అన్ని అడ్డంకులను దాటుకుని చిత్రం థియేటర్లలోకి వచ్చింది.

వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణకు ‘అఖండ 2’ ఎంత పెద్ద సక్సెస్‌ను అందిస్తుందో చూడాలి. అదే సమయంలో, మోక్షజ్ఞ ఎంట్రీపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తానికి…మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ నందమూరి అభిమానులను ఇంకా ఉత్కంఠకి గురి చేస్తూనే ఉంది . 2026 న్యూ ఇయర్‌కు గుడ్ న్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.