మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో చిత్తశుద్ధి అవసరం. లక్ష్యం నుంచి దృష్టి మరలకుండా జాగ్రత్త వహించండి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆత్మవిశ్వాసంతో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు మితిమీరకుండా జాగ్రత్త వహించండి. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండండి.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఉహించని విజయాలు సాధిస్తారు. పదోన్నతులతో అధికార యోగం ఉంటుంది. అధికారుల ప్రశంసలు ఉత్సాహాన్నిస్తాయి. ఆర్థికంగా సంతృప్తికర ఫలితాలు సాధిస్తారు.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు ఉత్సాహంగా పూర్తిచేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో శుభవార్తలు వింటారు. ఆర్థికాభివృద్ధికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఓర్పు, సహనంతో ఉండాలి.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. ఉత్సాహంతో పనిచేస్తే సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముందుచూపుతో, చక్కని ప్రణాళికతో ఉద్యోగ వ్యాపారాల్లో ప్రత్యేక గుర్తింపు పొందుతారు. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆదాయం పెరగడం ఆనందం కలిగిస్తుంది. స్పష్టమైన విధానంతో ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికి పట్టుదలతో అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో చురుగ్గా పనిచేయడం వలన ఆశించిన ఫలితాలు పొందుతారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగ్గించుకుంటే మంచిది. ఆవేశపూరిత నిర్ణయాలు సమస్యలు కలిగిస్తాయి.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. ఆర్థిక క్రమశిక్షణతో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో బుద్ధిబలంతో వ్యవహరించడం వలన ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మనోధైర్యం కోల్పోవద్దు. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ పరిస్థితులు సానుకూలంగా మారుతాయి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు క్రమంగా తొలగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఆనందం కలిగిస్తాయి. ఒక శుభవార్త ఉత్సాహం కలిగిస్తుంది. కుటుంబంలో పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారుతాయి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాల కోసం శ్రమించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో అధికారులతో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఒత్తిడిని అధిగమించి ముందుకు సాగితే ఆశించిన విజయం సిద్ధిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే పరిస్థితులకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యుల సహకారంతో ఒత్తిడి అధిగమిస్తారు. ఆదాయవ్యయాలు సరిసమానంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో వివాదాలు రాకుండా చూసుకోండి.