07.05.2024 మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ప‌ట్టింద‌ల్లా బంగార‌మే..!

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

07.05.2024 మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ప‌ట్టింద‌ల్లా బంగార‌మే..!

మేషం

మేషరాశి వారికి ఈ రోజంతా సుఖశాంతులతో గడుస్తుంది. ఈ రోజంతా శారీరకంగా, మానసికంగా శక్తివంతంగా ఉంటారు. ముఖ్యమైన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. తొందరపాటు పనికి రాదు. అనుకోని సమస్యలు ఎదురవుతాయి. జాగ్రత్తగా వ్యవహరిస్తే సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ఖర్చులు పెరగకుండా చూసుకోండి.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. పట్టింది అంతా బంగారం అవుతుంది. వ్యాపారంలో ఆదాయం బాగా పెరుగుతుంది పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి. ఉద్యోగులకు శుభసమయం నడుస్తోంది.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పదోన్నతి, బదిలీ అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. దూరప్రాంతాల నుంచి అందిన శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది.

సింహం

ఈ రోజు మీకు సాధారణంగా గడుస్తుంది. గతంలో మొదలు పుట్టిన పనులను పూర్తి చేస్తారు. ఈ రోజు మీ లక్ష్యం దిశగా మీ నడక ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మేలు. వ్యాపారులకు వ్యాపారంలో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఈ రోజంతా గందరగోళంగా, ఒత్తిడితో ఉంటారు. మీ స్నేహితులతో కలిసి భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు పనికిరాదు. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది.

తుల

తులారాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు తారా బలం చాలా బాగుంది. శాంతియుతంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. ఖర్చులు అదుపులో ఉంటాయి. ముఖ్యమైన అవసరాలకే ఆచి తూచి ఖర్చు చేస్తారు. పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. గ్రహసంచారం మెరుగు పడటానికి మరికొంత సమయం పట్టవచ్చు. అప్పటివరకు సహనంతో ఉండండి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఆర్థిక నష్టం సూచితం.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉండదు. అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. వైద్య చికిత్సలకు డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు, తల్లితో విరోధం వంటి సమస్యలు ఏర్పడుతాయి.

కుంభం

కుంభరాశి వారికి శుభసమయం నడుస్తోంది. ఇప్పటివరకు వెంటాడిన ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని వీడుతాయి. గతం కంటే ఎంతో మెరుగైన ఫలితాలను చూడబోతున్నారు. ఉద్యోగులు ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. పెట్టుబడుల రూపంలో ధనప్రవాహం ఉంటుంది.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే మీ మిత్రులే శత్రువులవుతారు. ఆర్థిక సంబంధమైన విషయాలలో తగు జాగ్రత్త వహించండి.