Costly Marriages | కోట్ల ఖర్చుతో గ్రాండ్‌గా జరిగిన సెలబ్రిటీల పెళ్లిళ్లు…. భారత్‌లో అత్యంత ఖరీదైన సెలబ్రిటీ వివాహాలు ఇవే!
Costly Marriages | భారతదేశంలో సినిమా, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల పెళ్లిళ్లు సాధారణంగా భారీగా ఖర్చు చేసి అద్భుతంగా నిర్వహించడం తెలిసిందే. లగ్జరీ ప్యాలెస్‌లు, ఫైవ్ స్టార్ రిసార్టులు, ఖరీదైన డెకరేషన్‌లు, ప్రముఖ డిజైనర్ల దుస్తులు ఇలా ప్రతి అంశంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఈ వేడుకలను మరింత ఘనంగా నిర్వహిస్తారు.
Costly Marriages | భారతదేశంలో సినిమా, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల పెళ్లిళ్లు సాధారణంగా భారీగా ఖర్చు చేసి అద్భుతంగా నిర్వహించడం తెలిసిందే. లగ్జరీ ప్యాలెస్‌లు, ఫైవ్ స్టార్ రిసార్టులు, ఖరీదైన డెకరేషన్‌లు, ప్రముఖ డిజైనర్ల దుస్తులు ఇలా ప్రతి అంశంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఈ వేడుకలను మరింత ఘనంగా నిర్వహిస్తారు. అందుకే ఈ పెళ్లిళ్లు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంటాయి.
విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందాన వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అత్యంత వైభవంగా జరిగింది. రాజసంగా కనిపించే ప్యాలెస్ వేదికలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ పెళ్లి వేడుకలు జరిగాయి. లగ్జరీ డెకరేషన్, ప్రత్యేకంగా రూపొందించిన స్టేజ్, ఖరీదైన డిజైనర్ దుస్తులు వంటి ఏర్పాట్లతో ఈ పెళ్లి ఎంతో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుక కోసం సుమారు రూ.12 నుంచి 20 కోట్ల వరకు ఖర్చు అయ్యిందని సమాచారం.
దీపికా పదుకొణె – రణ్‌వీర్ సింగ్
బాలీవుడ్ స్టార్ జంట దీపికా పదుకొణే, రణ్‌వీర్ సింగ్ 2018లో ఇటలీలోని అందమైన లేక్ కోమో వద్ద డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఈ వివాహం కొంకణి, సింధీ సంప్రదాయాల ప్రకారం రెండు విధాలుగా నిర్వహించారు. అనంతరం భారతదేశంలో బాలీవుడ్ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్‌లు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఈ పెళ్లి వేడుకలకు సుమారు రూ.70 నుంచి 77 కోట్ల వరకు ఖర్చయిందని రిపోర్టులు చెబుతున్నాయి.
ప్రియాంక చోప్రా – నిక్ జోనస్
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి ప్రియాంక చోప్రా, అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ 2018లో జోధ్‌పూర్‌లోని ప్రముఖ ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో వివాహం చేసుకున్నారు. హిందూ మరియు క్రైస్తవ సంప్రదాయాల్లో జరిగిన ఈ పెళ్లి వేడుకలు అద్భుతంగా సాగాయి. అంతర్జాతీయ అతిథులు, లగ్జరీ ఏర్పాట్లతో జరిగిన ఈ వివాహానికి రూ.60 కోట్లకు పైగా ఖర్చయిందని సమాచారం.
కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ 2021లో రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెఉస్ ఫోర్ట్ బర్వారాలో అట్టహాసంగా వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందు జరిగిన మెహందీ, సంగీత్ వంటి వేడుకలు, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, ఖరీదైన డిజైనర్ దుస్తులతో ఈ వేడుక ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. ఈ వివాహానికి సుమారు రూ.70 నుంచి 75 కోట్ల వరకు ఖర్చయిందని అంచనా.
అనుష్క శర్మ – విరాట్ కోహ్లీ
బాలీవుడ్ నటి అనుష్క శర్మ, భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ 2017లో ఇటలీలోని టస్కనీ ప్రాంతంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఓ లగ్జరీ రిసార్ట్‌లో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ వేడుకను నిర్వహించారు. అయినప్పటికీ ఖరీదైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన అలంకరణలతో ఈ వివాహం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ పెళ్లికి సుమారు రూ.90 నుంచి 100 కోట్ల వరకు ఖర్చయిందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే భారతదేశంలో సెలబ్రిటీ వివాహాలు కేవలం పెళ్లి వేడుకలే కాకుండా అట్టహాసం, విలాసానికి ప్రతీకలుగా మారుతున్నాయి. కోట్ల రూపాయల ఖర్చుతో జరిగే ఈ వేడుకలు అభిమానులను కూడా విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram