జ్యోతిష్యం అంటే నమ్మకం. గ్రహస్థితి బాగుంటే.. అంతా మంచే జరుగుతుందని అనుకుంటాం. గ్రహస్థితుల ఆధారంగా జ్యోతిష్యాలు ఉంటాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతుంటారు. అందువల్ల ఏ రోజుకారోజు వారి రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు…
మేషం
ప్రముఖుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుతాయి. కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ఉపాధిలో అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి.
వృషభం
చేపట్టిన పనుల్లో కొంత జాప్యం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో కొంత నిరాశ ఎదురవుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో పరిస్థితులు సానకూలంగా ఉండవు. ఇంటిలోనూ, బయట వ్యవహారాల్లో యుక్తిగా వ్యవహరించడం మేలు. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. వైద్య సంప్రదింపులు చేయాల్సి వస్తుంది. భక్తి, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
మిధునం
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు తొందరపడి మాట జారకుండా ఉంటే మంచిది. రాబడి, ఖర్చు సరిసమానంగా ఉండొచ్చు. అనుకోని ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులు తమపై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
కర్కాటకం
ఇంటి విషయాలలో సొంత ఆలోచనలు అమలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. ప్రముఖులతో పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. కార్యాలయాల్లో వాతావరణం ఉత్సాహకరంగా ఉంటుంది.
సింహం
ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా మసులు కోవడం మంచిది. ఇంట్లోనివారితో మాటపట్టింపులు ఉండొచ్చు. ముఖ్యమైన పనులలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
కన్య
ఆదాయ మార్గాలు పెరిగిన కారణంగా రుణాలు తీర్చగలుగుతారు. దైవిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.
తుల
ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మిత్రుల నుంచి రుణాల ఒత్తిళ్లు పెరుగుతాయి. దైవిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు ఏర్పడుతాయి. నూతన రుణ యత్నాలు చేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి.
వృశ్చికం
కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శిస్తారు. నూతన వాహనయోగం ఉన్నది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. కీలక వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో ఎదురవుతున్న సమస్యల నుంచి బయటపడగలుగుతారు.
ధనస్సు
సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. దైవిక, ఆధ్మాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. చిన్నప్పటి విషయాలు గుర్తుకు వస్తాయి. పనులు వేగంగా పూర్తవుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.
మకరం
కీలక వ్యవహారాలలో ఆలోచనలు అస్థిరంగా ఉంటాయి. భూములకు సంబంధించిన వివాదాలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ముఖ్య పనులు ముందుకు కదలవు. ఆలయాలను సందర్శిస్తారు. ఆశించిన ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా సమానంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.
కుంభం
ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి ఉండదు.
మీనం
దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. పలుకుబడి కలిగిన వారి పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.
