శివుడికి వీటితో అభిషేకం చేస్తే.. కోరిన కోరిక‌లు నెర‌వేరుతాయ‌ట‌..!

శివుడికి నీళ్లు, పూల‌తో పూజిస్తే కోరిన కోరిక‌లు నెర‌వేరుతాయ‌ని పండితులు చెబుతున్నారు. అయితే ఈ నీళ్ల‌తో పాటు మ‌రికొన్ని ప‌దార్థాల‌ను క‌లిపి అభిషేకం చేయ‌డం వ‌ల్ల ఆ మ‌హాశివుడు ఎంతో సంతృప్తి చెంది, మ‌నం కోరుకున్న కోరిక‌ల‌ను త‌ప్ప‌కుండా నెర‌వేరుస్తాడ‌నేది న‌మ్మ‌కం.

  • Publish Date - April 22, 2024 / 06:47 AM IST

సోమ‌వారం నాడు ఆ మ‌హాశివుడికి భ‌క్తులు పూజ‌లు చేస్తుంటారు. శివాల‌యాల‌కు వెళ్లి అభిషేకం చేయించి ఈశ్వ‌రుడి అనుగ్ర‌హం పొందుతారు. శివుడికి నీళ్లు, పూల‌తో పూజిస్తే కోరిన కోరిక‌లు నెర‌వేరుతాయ‌ని పండితులు చెబుతున్నారు. అయితే ఈ నీళ్ల‌తో పాటు మ‌రికొన్ని ప‌దార్థాల‌ను క‌లిపి అభిషేకం చేయ‌డం వ‌ల్ల ఆ మ‌హాశివుడు ఎంతో సంతృప్తి చెంది, మ‌నం కోరుకున్న కోరిక‌ల‌ను త‌ప్ప‌కుండా నెర‌వేరుస్తాడ‌నేది న‌మ్మ‌కం. మ‌రి ఏయే ప‌దార్థాల‌తో అభిషేయం చేయాలో తెలుసుకుందాం.

ఆవు పాలు

ఆవు పాల‌తో మ‌హా శివుడిని అభిషేకం చేయ‌డం వ‌ల్ల గొప్ప లాభాల‌ను పొందుతారు. ఆవుపాల‌తో శివుడికి పూజ‌లు చేయ‌డంతో ఆ ఇంట్లో అష్టైశ్వ‌ర్యాలు క‌లుగుతాయ‌ని పండితులు చెబుతున్నారు.

ఆవు పెరుగు

ఆవు పెరుగుతో కూడా శివుడికి అభిషేయం చేయ‌డం వ‌ల్ల ఆ ఇంట ఎన్నో లాభాలు క‌లుగుతాయి. ఆరోగ్యంతో పాటు బ‌ల‌ము, య‌శ‌స్సు క‌లుగుతాయి.

ఆవు నెయ్యి

సాధారణ నెయ్యి కన్నా ఆవు నెయ్యితో పూజలు చేయడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చు. ముఖ్యంగా పరమశివుడికి ఆవు నెయ్యితో పూజలు చేయడం వల్ల ఐశ్వర్యం పందవచ్చని వేద పండితులు చెబుతున్నారు.

తేనె

తేనెతో మహా శివుడికి అభిషేకం చేయడం వల్ల పూర్వ జన్మ పాపాలు తొలగుతాయి. అంతేకాకుండా తేజోవృద్ధి కలుగుతుంది.

కొబ్బరి నీళ్లు

కొబ్బ‌రి నీళ్ల‌తో శివుడికి అభిషేకం చేయ‌డం వ‌ల్ల ఆ ఇంట్లో స‌ర్వ‌సంప‌ద‌లు క‌లుగుతాయి. ప్ర‌తి సోమ‌వారం ఆ మహా శివుడికి కొబ్బరి నీళ్ల‌తో అభిషేకం చేయ‌డం వ‌ల్ల ఐశ్వ‌ర్యం మీ సొంత‌మ‌వుతుంది.

సుగంధ జలం

సుగంధ వెదజల్లే వాటిని మహాశివుడు ఎంతో ఇష్ట పడుతారు. ముఖ్యంగా సుగంధ జలంతో అభిషేకం చేస్తే పుత్ర ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

బిల్వ పత్రం

బిల్వజలంతో భోగ భాగ్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. బిల్వజలంతో పాటు శివుడి మంత్రం జపించడం వల్ల ఎన్నో లాభాలు పొందుతారు.

Latest News