333 Kg Ganesh Laddu for Just ₹99 | హైదరాబాద్ యువకుడికి అదృష్టం – రూ.99కే 333 కిలోల గణేశ్ లడ్డూ

కొత్తపేట్​లో జరిగిన లక్కీ డ్రాలో హైదరాబాద్ యువకుడు రూ.99కే 333 కిలోల గణేశ్ లడ్డూను గెలుచుకున్నాడు. మొత్తం 760 టిక్కెట్లలో అతనికి అదృష్టం కలిసివచ్చింది.

333 Kg Ganesh Laddu for Just ₹99 | హైదరాబాద్ యువకుడికి అదృష్టం – రూ.99కే 333 కిలోల గణేశ్ లడ్డూ

333 Kg Ganesh Laddu for Just ₹99 | హైదరాబాద్‌లో గణేశ్ నవరాత్రుల సందడి కొనసాగుతున్న వేళ, ఒక యువకుడి అదృష్టం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకపక్క కోట్లు, లక్షల రూపాయలకు వేలం వేసే గణేశ్ లడ్డూల వార్తలు వైరల్​ అవుతుంటే, మరోపక్క కేవలం రూ.99కే 333 కిలోల భారీ లడ్డూ గెలుచుకున్న కథ ఇప్పుడు వైరల్ అవుతోంది.

కొత్తపేట్​లో ఏకదంత యువజన సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన లక్కీ డ్రాలో, అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థి సాక్షిత్ గౌడ్ గెలుపొందాడు. ఈ డ్రాలో మొత్తం 760 టిక్కెట్లు విక్రయించగా, అందులో సాక్షిత్ కొన్న ఒక టికెట్​కు అదృష్టాన్ని దక్కింది. ఫలితంగా, 333 కిలోల లడ్డూను కేవలం రూ.99కే తన ఇంటికి తీసుకెళ్లే అవకాశం అతడికి దక్కింది.

సాధారణంగా గణేశ్ లడ్డూలను వేలం వేసినప్పుడు లక్షల రూపాయల వరకు ధరలు పెరుగుతాయి. కానీ ఈసారి లక్కీ డ్రా పద్ధతిలో సాక్షిత్ లాంటి యువకుడు గెలవడంతో, ఇది భక్తులకు, ప్రజలకు ఆశ్చర్యకరంగా, ఆనందకరంగా మారింది. గణేశ్ నవరాత్రుల్లో భక్తి, అదృష్టం, ఉత్సాహం ఇలా కలిసిపోవడం ఈ సంఘటనకు ప్రత్యేకతనిచ్చింది.