Mole | అక్క‌డ పుట్టుమ‌చ్చ ఉంటే.. జీవితంలో ఎంతో గౌర‌వం ల‌భిస్తుంద‌ట‌..!

Mole | పుట్టు మ‌చ్చ‌ల‌ను( Moles ) చాలా మంది అదృష్టంగా భావిస్తారు. అయితే శ‌రీరంలోని కొన్ని భాగాల్లో ఉండే పుట్టు మ‌చ్చ‌ల‌ను శుభంగా భావిస్తే, మ‌రికొన్ని భాగాల్లో ఉండే పుట్టుమ‌చ్చ‌ల‌ను అశుభంగా భావిస్తారు. ప్ర‌ధానంగా ఈ భాగంలో పుట్టు మ‌చ్చ ఉంటే జీవితాంతం గౌర‌వంగా( Respect ) జీవిస్తార‌ని పండితులు చెబుతున్నారు.

  • By: raj |    devotional |    Published on : Dec 10, 2025 6:48 AM IST
Mole | అక్క‌డ పుట్టుమ‌చ్చ ఉంటే.. జీవితంలో ఎంతో గౌర‌వం ల‌భిస్తుంద‌ట‌..!

Mole | శ‌రీరంపై అనేక భాగాల్లో పుట్టు మ‌చ్చ‌లు( Moles ) ఉంటాయి. కొన్ని పుట్టు మ‌చ్చ‌లు పుట్టుక‌తోనే వ‌స్తాయి. మ‌రికొన్ని వ‌య‌సు పెరిగే కొద్ది పుట్టుకొస్తుంటాయి. అయితే శ‌రీరంలోని ఈ భాగాల్లో పుట్టు మ‌చ్చ‌లు ఉంటే అదృష్టాన్ని( Luck ) తీసుకువ‌స్తాయ‌ని పండితులు చెబుతున్నారు. మ‌రి ఏయే భాగాల్లో పుట్టుమ‌చ్చ‌లు ఉంటే అదృష్టం క‌లిసి వ‌స్తుందో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

చెంప‌పై పుట్టుమ‌చ్చ‌

స్త్రీ, పురుషుల్లో ఎవ‌రికైనా స‌రే.. చెంప‌పై పుట్టుమ‌చ్చ ఉంటే దాన్ని అదృష్టంగా భావించాలి. వీరు జీవితాంతం సంతోషంగా ఉంటారు. ఎడ‌మ చెంప‌పై పుట్టుమ‌చ్చ ఉంటే మ‌రింత మంచిది. ఆర్థిక స‌మ‌స్య‌లు కూడా పెద్ద‌గా సంభ‌వించ‌వు అని పండితులు పేర్కొంటున్నారు.

ఛాతీ మ‌ధ్య‌లో..

ఛాతీ మ‌ధ్య‌లో పుట్టు మ‌చ్చ‌లు ఉన్న వ్య‌క్తులు కూడా చాలా అదృష్ట‌వంతులు. ఈ వ్య‌క్తుల‌కు జీవితాంతం గౌర‌వం ల‌భిస్తుంది. నాభిపైన‌, దాని చుట్టూ పుట్టుమ‌చ్చ ఉంటే అది కూడా శుభ సంకేతంగా ప‌రిగ‌ణించాల‌ని పండితులు చెబుతున్నారు.

నుదుటిపై పుట్టుమ‌చ్చ‌

నుదుటిపై పుట్టుమ‌చ్చ‌లు ఉన్న దాన్ని కూడా శుభ‌ప్ర‌దంగా ప‌రిగ‌ణించాలి. ఈ వ్య‌క్తులు ఎప్పుడు కూడా ధ‌న న‌ష్టాల‌ను చూడ‌రు. అదృష్టం క‌లిసి వ‌స్తుంది. గొంతు ద‌గ్గ‌ర పుట్టుమ‌చ్చ ఉన్న శుభంగానే ప‌రిగ‌ణించాలి.

ముక్కుపై పుట్టుమ‌చ్చ‌

ముక్కుపై పుట్టుమ‌చ్చ ఉన్న వ్య‌క్తులు బాగా సంపాదిస్తారు. ఆర్థిక స‌మ‌స్య‌లు కూడా వీరికి త‌క్కువే. అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే.. అది జీవితంలో ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుంద‌ని పండితులు చెబుతున్నారు.