Site icon vidhaatha

21 బియ్య‌పు గింజ‌ల‌తో ఇలా చేయండి.. ఆ ఇంట్లో ధ‌న లాభం క‌లుగుతుంద‌ట‌..!

జీవితంలో ప్ర‌తి ఒక్క‌రూ ఆర్థికంగా ఎద‌గాల‌ని కోరుకుంటారు. కుటుంబ స‌భ్యుల‌తో సంతోషంగా గ‌డ‌పాల‌ని కోరుకుంటారు. ఈ రెండింటి కోసం ఆ ఇంటి య‌జ‌మాని ఎంతో క‌ష్ట‌ప‌డుతుంటాడు. రాత్రింబ‌వ‌ళ్లు ప‌ని చేసి సంపాదిస్తుంటాడు. అయిన‌ప్ప‌టికీ ఆర్థిక క‌ష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. చేతికొచ్చిన డ‌బ్బు కూడా నీళ్ల‌లా ఖ‌ర్చు అవుతుంటుంది. అప్పులు కూడా విప‌రీతంగా చేస్తుంటారు. మ‌రి అప్పులు మాయ‌మై, ఆర్థికంగా నిల‌దొక్కుకోవాలంటే.. బియ్య‌పు గింజ‌ల‌తో ఇలా చేస్తే ధ‌న లాభం క‌లుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

బియ్య‌పు గింజ‌ల‌ను హిందూ సంప్ర‌దాయంలో అక్షింత‌లుగా ఉప‌యోగిస్తుంటారు. శుభకార్యాలు జ‌రిగిన‌ప్పుడు ప‌సుపు, కుంకుమ రాసిన బియ్య‌పు గింజ‌ల‌ను అక్షింత‌లుగా చ‌ల్లి ఆశీర్వ‌దిస్తుంటారు. ఎందుకంటే దేవుడికి అక్షింత‌లు అంటే ఎంతో ఇష్టం. కాబ‌ట్టి నాలుగు గింజ‌లు చ‌ల్లిన దేవుళ్లు ప్ర‌స‌న్న‌మైపోతార‌ట‌.

ఇక ఆర్థిక క‌ష్టాల‌తో బాధ‌ప‌డేవారు.. శుభ ముహూర్తాన ఒక ఎర్ర‌టి వ‌స్త్రంలో ఇర‌వై ఒక్క బియ్యం గింజ‌లు తీసుకొని వాటికి ప‌సుపు క‌ల‌పాలి. ఆ బియ్యాన్ని వ‌స్త్రంలో క‌ట్టి దానిని ల‌క్ష్మీదేవి ముందు ఉంచాలి. ఆ త‌ర్వాత భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పూజించాలి. అనంత‌రం బియ్యంతో కూడిన వ‌స్త్రాన్ని న‌గదు పెట్టే ప్రాంతంలో ఉంచాలి. దాంతో ధ‌న లాభం క‌లుగుతుంద‌ని పండితుల న‌మ్మ‌కం. అంతేకాకుండా మిగ‌తా ప‌నులు కూడా విజ‌య‌వంత‌మ‌వుతాయ‌ని చెబుతున్నారు.

Exit mobile version