IRCTC Sapta Jyotirlinga Tour | రూ.17వేల్లోనే సప్త జ్యోతిర్లింగాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ఆధ్యాత్మిక టూర్!

IRCTC Sapta Jyotirlinga Tour | దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఏడింటిని దర్శించుకునేలా సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్రకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చింది. ఏప్రిల్ 14వ తేదీన హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర 10 రాత్రులు, 11 రోజుల పాటు కొనసాగనుంది.

IRCTC Sapta Jyotirlinga Tour | రూ.17వేల్లోనే సప్త జ్యోతిర్లింగాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ఆధ్యాత్మిక టూర్!

IRCTC Sapta Jyotirlinga Tour | ప్రతి హిందువు తన జీవితకాలంలో జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని అనుకుంటుంటాడు. ఈ క్షేత్రాలను దర్శించడం ద్వారా పాపవిమోశనం జరిగి మోక్షం లభిస్తుందని భావిస్తుంటారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఆధ్మాతిక యాత్రను ప్లాన్ చేసింది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఏడింటిని దర్శించుకునేలా సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్రకు సిద్ధం చేసింది. ఏప్రిల్ 14వ తేదీన హైదరాబాద్ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది.

టూర్ వివరాలు

భారత్ గౌరవ్ రైలు ద్వారా మొత్తం 10 రాత్రులు, 11 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో భాగంగా ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్; ద్వారకలోని నాగేశ్వర్, సోమనాథ్, పుణేలోని భీమశంకర్, నాసిక్‌లోని త్రయంబకేశ్వర్, ఔరంగాబాద్‌‌లోని గృష్నేశ్వర్ జ్యోతిర్లింగాలను దర్శించుకునేలా ఐఆర్‌సీటీసీ టూర్‌ను షెడ్యూల్ చేసింది.

ప్యాకేజీ ధరలు

ఈ టూర్‌లో భాగంగా మూడు కేటగిరీల్లో ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలను సిద్ధం చేసింది. కంఫర్ట్ (2టైర్ ఏసీ) విభాగంలో పెద్దలకు రూ.34,600; పిల్లలకు (5-11 ఏళ్లలోపు) రూ.32,800 చార్జ్ చేయనుంది. స్టాండర్డ్ (3టైర్ ఏసీ) విభాగంలో పెద్దలకు రూ.26,700; పిల్లలకు రూ.25,200 వసూలు చేయనుంది. ఇక ఎకానమీ(స్లిపర్ క్లాస్) కేటగిరీలో పెద్దలకు రూ.17,600, పిల్లలకు రూ.16,300 చార్జి చేయనుంది. అన్ని కేటగిరీల్లో కలిపి మొత్తం 702 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆసక్తిగల వారు త్వరపడాలని ఐఆర్‌సీటీసీ సూచిస్తోంది.

రోజువారీ టూర్ ప్లాన్

మొదటి రోజు: హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 10 గంటలకు యాత్ర ప్రారంభమవుతుంది. కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముడ్ఖేడ్, నాందేడ్, పూర్ణ స్టేషన్ల మీదుగా యాత్ర కొనసాగుతుంది. ఆయా స్టేషన్లలో బోర్డింగ్ కూడా ఉంటుంది

రెండో రోజు: ఓవర్‌నైట్ జర్నీ అనంతరం ఉదయం 10 గంటలకు ఉజ్జయిని చేరుకుంటారు. అక్కడ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటారు. రాత్రికి అక్కడే బస ఉంటుంది.

మూడో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం రోడ్డుమార్గంలో బయల్దేరి వెళ్లి ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం అక్కడి నుంచి అంబేద్కర్ నగర్ రైల్వే స్టేషన్‌కు వెళ్తారు. అక్కడి నుంచి రాత్రి 11 గంటలకు ద్వారకకు బయల్దేరతారు.

నాలుగో రోజు: సాయంత్రం 6.30 గంటలకు ద్వారకకు చేరుకుంటారు. హోటల్‌లో చెక్‌ఇన్ అయిన తర్వాత భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు.

ఐదో రోజు: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అనంతరం ద్వారకాధీశ్ ఆలయం దర్శించుకుంటారు. అనంతరం హోటల్‌కు వెళ్లి లంచ్ చేసి విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం బెట ద్వారక, నాగేశ్వర జ్యోతిర్లింగాలను దర్శించుకుంటారు. ఆ తర్వాత ఓఖా రైల్వే స్టేషన్‌కు వెళ్లి అక్కడి నుంచి రాత్రి 9 గంటలకు సోమ్‌నాథ్ బయల్దేరతారు.

ఆరో రోజు: ఉదయం 6 గంటలకు సోమ‌నాథ్‌ చేరుకుంటారు. ఫ్రెష్ అయిన తర్వాత సోమ్‌నాథ్ జ్యోతిర్లింగ ఆలయాన్ని దర్శించకుంటారు. అనంతరం సోమనాథ్ రైల్వే స్టేషన్ నుంచి పుణే బయల్దేరతారు.

ఏడో రోజు: మధ్యాహ్నం ఒంటి గంటవరకు పుణె చేరుకుంటారు. అక్కడి హోటల్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. రాత్రి అక్కడే బస ఉంటుంది.

ఎనిమిదో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం హోటల్ చెక్అవుట్ చేసి, భీమశంకర్ జ్యోతిర్లింగ ఆలయ దర్శనానికి వెళ్తారు. దర్శనం అనంతరం నాసిక్ బయల్దేరి వెళ్తారు.

తొమ్మిదో రోజు: నాసిక్‌ చేరుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి త్రయంబకేశ్వర్ ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం రాత్రి 11 గంటలకు ఔరంగబాద్ బయల్దేరి వెళ్తారు.

10వ రోజు: ఉదయం 5 గంటలకు ఔరంగబాద్ చేరుకుని ఘృష్ణేశ్వర ఆలయా ఆలయాన్ని దర్శించుకుంటారు. రాత్రి 8 గంటలకు తిరుగు ప్రయాణమవుతారు.

11వ రోజు: పూర్ణ, నాందేడ్, ముడ్ఖేడ్, ధర్మాబాద్, నిజామాబాద్, కామారెడ్డి మీదుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.

ప్యాకేజీలో ఉండే సదుపాయాలు

* రైలు ప్రయాణం
* హోటల్ వసతి
* రోజుకు మూడు సార్లు వెజ్ భోజనం
* లోకల్ ట్రాన్స్‌పోర్టు
* ట్రావెల్ ఇన్సూరెన్స్
* టూర్ మేనేజర్ సపోర్టు

ప్యాకేజీలో లేని సదుపాయాలు

* ఎంట్రీ టికెట్లు
* వ్యక్తిగత ఖర్చులు
* స్పెషల్ దర్శనాలు
* రూమ్ సర్వీస్ చార్జీలు

ముఖ్య నిబంధనలు

* ఒకసారి యాత్రకు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత.. 15 రోజుల ముందు క్యాన్సిల్ చేస్తే రూ.250 మాత్రమే కట్ చేసుకుంటారు. అదే 4 రోజుల్లో క్యాన్సిల్ చేస్తే 100 శాతం కట్ చేసుకుంటారు. ప్రయాణానికి ఐడీ ప్రూఫ్ తప్పనిసరి. రైలు సమయాల్లో మార్పులు ఉండవచ్చు.

Read More:

Arunachala Moksha Yatra | ఆధ్యాత్మికం.. ఆహ్లాదం.. రూ.10వేల లోపే ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర!

వీకెండ్‌లో తమిళనాడు ట్రిప్.. రూ.15వేలలోనే ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీ