Arunachala Moksha Yatra | ఆధ్యాత్మికం.. ఆహ్లాదం.. రూ.10వేల లోపే ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర!

Arunachala Moksha Yatra | ఆధ్యాత్మికతతో పాటు ప్రశాంతంగా తిరిగి రావాలని అనుకునే వారి కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక అవకాశం తీసుకొచ్చింది. అరుణాచల మోక్ష యాత్ర పేరుతో పుదుచ్చేరి, తిరువణ్ణామలై(అరుణాచలం), కాంచీపురం వంటి పవిత్ర ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పించింది.

Reported by: Chandram | ట్రెండింగ్ | Mar 21, 2026, 12:12 am IST
Read Time: 7 mins
Arunachala Moksha Yatra | ఆధ్యాత్మికం.. ఆహ్లాదం.. రూ.10వేల లోపే ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర!

Arunachala Moksha Yatra | ఆధ్యాత్మికతతో పాటు ప్రశాంతంగా తిరిగి రావాలని అనుకునే వారి కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక అవకాశం తీసుకొచ్చింది. అరుణాచల మోక్ష యాత్ర పేరుతో పుదుచ్చేరి, తిరువణ్ణామలై(అరుణాచలం), కాంచీపురం వంటి పవిత్ర ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పించింది. మొత్తం నాలుగు రాత్రులు, ఐదు రోజుల పాటు జరిగే ఈ ట్రిప్ ప్రతి శుక్రవారం కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభం కానుంది.

అరుణాచల యాత్ర అనగానే పర్యటన మాత్రం ఆధ్యాత్మిక ధోరణిలోనే ఉంటుందని అనుకోవచ్చు. కానీ ఐఆర్‌సీటీసీ ఆధ్యాత్మికతతో పాటు రిలాక్సేషన్‌ను కూడా సమాన ప్రాధాన్యతను ఇస్తూ ఈ టూర్‌ను ప్లాన్ చేసింది. దేవాలయాలతో పాటు బీచ్‌ల్లో కూడా ఎంజాయ్ చేసేలా ఈ పర్యటను షెడ్యూల్ చేసింది.

టూర్ వివరాలు

హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఈ అరుణాచల మోక్ష యాత్ర ప్రారంభమవుతుంది. మొత్తం నాలుగు రాత్రులు, ఐదు రోజులు జరిగే ఈ పర్యటనలో భాగంగా పుదుచ్చేరి, అరుణాచం, కాంచీపురం వెళ్తారు. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే టూర్ కోసం ఐఆర్‌సీటీసీ కంఫర్ట్ (3టైర్ ఏసీ), స్టాండర్డ్ (స్లీపర్ క్లాస్) విభాగాలుగా చార్జ్ చేస్తున్నారు.

ప్యాకేజీ ధరలు

కంఫర్ట్‌లో విభాగంలో అయితే ట్విన్ షేరింగ్‌కు అయితే రూ.19,130; ట్రిపుల్ షేరింగ్‌కు అయితే రూ.14,740 ఐఆర్‌సీటీసీ చార్జ్ చేస్తుంది. ఇక 5 నుంచి 11 సంవత్సరాల లోపు పిల్లలకు బెడ్‌తో కలిపి రూ.10,700; బెడ్ లేకుండా అయితే రూ.8,060 చార్జ్ చేస్తుంది.

స్టాండర్డ్ విభాగంలో అయితే ట్విన్ షేరింగ్‌కు రూ.17,060 ఐఆర్‌సీటీసీ వసూలు చేస్తుంది. ట్రిపుల్ షేరింగ్‌కు అయితే రూ.12,6700 చార్జ్ చేస్తుంది. ఇక 5 నుంచి 11 సంవత్సరాల లోపు పిల్లలకు బెడ్‌తో కలిపి రూ.8,630 బెడ్ లేకుండా అయితే రూ.5,980 చార్జ్ చేస్తుంది. అదే ఈ పర్యటనకు నలుగురు కంటే ఎక్కువ బృందం వస్తే ఈ ధరలో తగ్గింపు ఉంటుంది.

రోజు వారీ టూర్ ప్లాన్

మొదటి రోజు: హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 5 గంటలకు కాచిగూడ పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్(ట్రైన్ నంబర్ 1763)లో బయల్దేరతారు. ఓవర్‌నైట్ జర్నీ ఉంటుంద

రెండో రోజు: ఉదయం 11.05 గంటలకు పుదుచ్చేరి చేరుకుంటారు. అక్కడే హోటల్‌లో చెక్ఇన్ అవుతారు. ఫ్రెష్అప్ అయిన తర్వాత అరోవిల్లె, అరవిందో ఆశ్రమం, పారడైజ్ బీచ్‌ను సందర్శిస్తారు. రాత్రికి పుదుచ్చేరిలోనే బస చేస్తారు.

మూడోరోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం పుదుచ్చేరి నుంచి తిరువణ్నామలై (అరుణాచలం) బయల్దేరతారు. అక్కడ హోటల్‌లో చెక్ఇన్ అయిన తర్వాత అరుణాచలేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారు. రాత్రికి తిరువణ్నామలైలోనే బస ఉంటుంది.

నాలుగో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం అరుణాచలం నుంచి బయల్దేరి కాంచీపురం వెళ్తారు. అక్కడ కామాక్షి అమ్మవారి ఆలయం, ఏకాంబరేశ్వర ఆలయం దర్శనం చేసుకుని అరక్కోణం వెళ్తారు. అక్కడి రైల్వే స్టేషన్ నుంచి తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.

ఐదో రోజు: ఓవర్‌నైట్ జర్నీ అనంతరం ఉదయం 7.50 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.

ప్యాకేజీలో ఉండే సదుపాయాలు

హైలైట్స్:

  • రైలు టికెట్లు
  • 2 బ్రేక్‌ఫాస్ట్‌లతో కలిపి రెండు రాత్రుల హోటల్ వసతి
  • లోకల్ ట్రాన్స్‌పోర్టుకు ఏసీ వాహన సదుపాయం
  • సైట్ సీయింగ్
  • ట్రావెల్ ఇన్సూరెన్స్
  • టోల్ పన్నులు

ప్యాకేజీలో లేని సదుపాయాలు

* మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం

* ట్రైన్‌లో భోజనం

* ఎంట్రీ టికెట్లు

* టూర్ గైడ్

* వ్యక్తిగత ఖర్చులు

ముఖ్య నిబంధనలు

* ప్రయాణానికి నాలుగు రోజుల ముందు టికెట్లు ఇస్తారు

* ట్రైన్ ఆలస్యంగా వస్తే షెడ్యూల్ మారుతుంది.

Read More:

IRCTC Thailand Tour | హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్ టూర్.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ.. రూ.53,900 నుంచే!

IRCTC Royal Nepal Package | హైదరాబాద్ నుంచి నేపాల్ టూర్.. ఐఆర్‌సీటీసీ కొత్త ట్రావెల్ ప్యాకేజీ